అబ్దుల్ చచా ఆదర్శ జీవితం
Abdul Inspire Life
ఓం సాయి
అబ్దుల్ చచా, తను ఒక పేద
వ్యాపారి, తను సైకిల్ పై ఒక చెక్క డబ్బా పెట్టుకొని
దానికి చుట్టు ప్లాస్టిక్ కవర్ కట్టి దానిని సైకిల్ వెనుక క్యారియర్ పై గట్టిగా కట్టుకోని
అందులో బన్(Bread) పిసెస్ ను
పెట్టుకొని చుట్టు ఉన్న ఊర్లలో అమ్ముకొని జీవనన్ని సాగిస్తున్న ఒక సాదారణ దిగువ
మధ్య తరగతి జీవనం. తనకు గంపేడు సంసారం ముగ్గురు కూతుర్లు ఇద్దరు అబ్బయిలు, అప్పుడు
అప్పుడు వచ్చే దగ్గరి బందువులు, వంశపారంపర్యంగా వచ్చే
ఒక పెద్ద పెంకుటిల్లు, అందరి జీవితాలు తను
అమ్మే ఆ బన్ (Bread) వ్యాపారం పైననే నిలబడివున్నవి.
తన జీవితంలో అనుబందం ఉన్న వాటిలో ముఖ్యమైనది తన సైకిల్ తర్వతే, తన భార్య అయిన
ఇంక ఎవరైన. తన సైకిల్ ను ఎంత శుభ్రంగా ఉంచుతాడు అంటే, తన వ్యాపారం
ఉదయం 5.గం. మొదలైతే 10.గం. లకు ముగుస్తుంది. ఆ తర్వత ఇంటికి వచ్చి కాస్త బోజనం
చేసి ప్రతి రోజు ఒక గంట సేపు శుభ్రంగా తన సైకిల్ తుడువడంతోనే సరిపోతుంది. తర్వత
సాయంత్రం 3.గం. నుండి 4.గం. మద్యన ప్రక్కనే ఉన్న ఆలేరు(Alair) టౌన్ కు వెళ్ళి
అక్కడ బన్ కం. నిలో బన్(Ban) కొనుక్కొని తన సైకిల్
పై చెక్క డబ్బాలో ఒక దానిపై ఒక్కటి పేర్చుకోని దానిని బద్రంగా ప్యాక్ చేసి మళ్ళీ
తిరిగి చీకటి కాక ముందే ఇంటికి చెరీ కాస్తా భార్య పెట్టిన భోజనం చేసి పడుకొని ఉదయం
4.గం. లకు లేసి తయారయి సైకిల్ పై బన్(Bread) డబ్బాను
కట్టుకోని పక్క ఉర్లలోకి బయలు దేరేవాడు. ఆ రోజుల్లో ఊర్లలో హోటళ్లు లేవు, ఎక్కువగా కిరణ
ధుకణాలు(Shops) కూడా లేవు, ఊరికి ఒక్కటో, కొంచం పెద్దవూరు
అయితే రెండు కిరణధుకణాలు, కాని అబ్దుల్ చచా తను
వెళ్ళే ఉర్లల్లో కనీసం కిరణ దుకాణం కూడా వుండదు. ఆ ఊరి పిల్లలకు తెల్లవారితే
అబ్దుల్ చచా డబ్బాల్ రొట్టె (Bread) అనే శబ్దం
వినిపిస్తే చాలు అమ్మ దగ్గర 1.రూ. తీసుకోవాలి చచా దగ్గర డబ్బాల్ రొట్టె (Bread) కొనుకొన్ని
ఛాయాలో తినాలి, అబ్ద్దుల్ చచా చేతి రొట్టె ఛాయిలో తింటూంటే
ఉంటుంది కదా| మెత్తని రొట్టె నోట్లో వేసుకుంటే
కరిగిపోతుంది, అంత మధురంగా రుచి ఉంటుంది తన చేతి రొట్టె.
అబ్దుల్ చచా ఈ డబ్బాల్
రొట్టెల్ అమ్ముతూనే ప్రజా సేవా కూడా చేసేవాడు, తనకు ఆ అల్లా
ఇచ్చిన దైవ (God) బలంతో చిన్న పిల్లలు నిద్రలో బయపడిన, నిద్రలో ఏడ్చే
పిల్లలకు ఆకస్మిక జ్వరాలకు (Fever) తను మంత్రం
వేసి, యంత్రలు కూడా కట్టేవాడు చాలా వరకు తగ్గుతు
ఉండేవి. తనకు ఆ జ్వరం తగ్గదు అనిపిస్తే , ఇది నా వల్ల
కాదు బాబును డాక్టర్ కు చూపించండి ఇది సాదారణ జ్వరం(Fever) కాదు అని చెప్పి, పిల్లల ఆరోగ్యం
చాలా ముఖ్యం అని చెప్పేవాడు . తను ఎంత సౌమ్యూడో అంత నిజాయితీ పరుడు, పక్క వల్ల
నుండి ఒక్క రూపాయి కూడా ఆశించే వాడు కాదు, తన జీవనమ్ ఒక యోగిల (Saint) గడిపేవాడు.
అబ్దుల్ చచా ప్రతి రోజు ఖురాన్ చదివే వాడు ప్రతి రోజు మసీద్
వెళ్ళే వాడు తనకు అంటూ ఉన్న పని ఖురాన్ చదవటం నమాజ్ చేయడం, సైకిల్ ను
శుభ్రంగా తుడవటం వ్యాపారానికి వెళ్ళిరావటం ఇది తన ప్రతి రోజు దినా చర్య, తను ఎంతో
క్రమబద్దమైన జీవితం, క్రమ శిక్షణ ఆంటే అది
అబ్దుల్ చచా రూపంలో ఉంటుందేమో. దనం అంటే ఏ మాత్రం వ్యామోహం లేదు, ఇతరుల పై ద్యేశమ్
కాని, కోపం గాని, అసూయ గాని లేని
అద్దం లాంటి మనస్సు, తెల్లని పాలల్లో అయిన
నీళ్లు కలుస్తాయి ఏమో, కాని తన మనస్సులో ఏ
కల్మషం కలవవు, కల్మషం అనే పదం తన జీవన దరిదాపుల్లోకి కూడా
చేరావు. ఇంత మంచి మనస్సు ఉన్న మనిషికి ఆర్దికమైన సమస్యలతో ఒక తండ్రిగా తన పిల్లలకు
జీవితంలో పూర్తి న్యాయం చేయలేకపోయిన ఒక విఫలమైన తండ్రిగా మిగిలిపోవలిసి వచ్చింది.
తన పిల్లల జీవితంలో ఒక పేద తండ్రిగా సరి అయిన స్థాయిలో
ఉంచలేకపోయాడు, పెద్ద కూతుర్ను ఒక రెండవ పెళ్లి అబ్బాయికి
ఇచ్చి పెళ్లి చేసి తన బరువు దింపేసుకున్నాడు, రెండవ కూతుర్ను
ఒక మదర్సాలో ఉర్దు బొదించే ఒక పేద ఉపాద్యాయుడికి (Teacher) ఇచ్చి పెళ్లి
చేశాడు, తన చిన్న కూతురు వరకు వచ్చే వరకు, తన అబ్బాయిలు
కూడా ఆర్దికంగా స్తిరపడక పోవడం వల్ల, ఆర్దికంగా ఉన్నతంగా
ఉండి భార్య చేనిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న తండ్రికి ఇచ్చి పెళ్ళిచేసినాడు. పెద్ద
అబ్బాయి చిన్న వ్యాపారంతో జీవితాన్ని గడుపుతుంటే తనకు ఓ సామాన్య కుటుంబం నుండి ఒక
అమ్మాయితో పెళ్లి చేసి వారి జీవితలను
వాళ్ళని బ్రతకండి అని, తను ఉండే ఇంటిలోనే
రెండు గదులు ఇచ్చి కొడుకు కోడలు జీవితాలకు స్వేచ్చను ఇచ్చడు. చిన్న కొడుకును ప్రక్క గ్రామంలో ఉండే బడే
బాబ కూతురుతో వివాహం చేసి బడేబాబ ఇంటికి చిన్న
అబ్బాయిని ఇల్లరికం ఇచ్చడు. బడే బాబ కు ముగ్గురు కూతుర్లు ఆ ఊర్లో ఆర్దికంగా ఉన్నత
స్తితిలో ఉన్న కుటుంబం కాబట్టి అబ్దుల్ చచా చిన్న కొడుకుని ఇల్లరికం తెచ్చుకొని తన ఆస్తికి
రక్షణ కల్పించుకున్నాడు.
ఆ రకంగా అబ్దుల్ చచా తన పిల్లల జీవితలను నిలబెట్టుకున్నప్పటికి
తను ఒక ఓటమి చెందిన తండ్రిగానే మిగిలాడు, కాని అబ్దుల్
చచా మానసికంగా చాల ఉన్నత స్థితిలో ఉన్న పరిపక్వత చెందిన వ్యక్తిత్వం తనకు ఎన్ని
కష్టాలు వచ్చిన తన జీవిత కాలంలో ఏ ఒక్కరి దగ్గర ఒక్కరూపాయి కూడా అప్పుచేయడానికి, ఏ గుమ్మము ఎక్కలేదు
ఎవ్వరి ముందు చెయ్యి చాచలేదు అంత గొప్ప వ్యక్తిత్వం, తను జీవిత కాలం
ఒకే వ్యాపారం చేసాడు అదే డబ్బాల్ రొట్టెల(Bread) వ్యాపారం, అదే సైకిల్, అదే జీవితం.
ఆ ఊర్లో అబ్దుల్ చచాకు ఉన్న ఒకే ఒక్క మిత్రుడు రాము. రాము
అబ్దుల్ చచా పక్కింటి అబ్బాయి, రాము చిన్నప్పటి నుండి
అబ్దుల్ చచా సైకిల్ అంటే చాలా ఇష్టం. అది ఎప్పుడు చూసిన కొత్తగా ఉండి నిగ నిగ
మెరుస్తూ ఉంటుంది. రాము ప్రతి రోజు
అబ్దుల్ చచాతో కనీసం ఒక గంట సమయమైన గడుపుతాడు, తను ఇంటి ముందు సైకిల్ పెట్టుకొని రోజు
శుబ్రంగా తుడిసి సైకిల్ ముందు వెనుక చెక్రాలకు కొబ్బరి నూనె ఆయిల్ కుప్పితో వేసి, కొన్ని చుక్కల
కొబ్బరి నూనే ఒక తెల్లని గుడ్డలో వేసి ఆ గుడ్డతో సైకిల్ ప్రతి భాగాన్ని తుడిసి
సైకిల్ కు పూర్తి ఆయిలు పూత పూసేవాడు. ఇది అంత రాము అబ్దుల్ చచాతో కలిసి రొజు
సాయంత్రం చూస్తు ఉండి సైకిల్ తుడవడంలో రాము అబ్దుల్ చచాకు సహాయంగ ఉండేవాడు. రాము
అంటే అబ్దుల్ చచాకు చాలా ఇష్టం ప్రతి రొజు సాయంత్రం రాముకు ఒక బన్ (Bread) ఇచ్చేవాడు, ఆ బన్ కు రాము
వల్ల అమ్మ డబ్బులు ఇచ్చిన తీసుకునేవాడు కాదు, రాము నా ధోస్తు
వాడికి నీవు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేవాడు, రాము ప్రతి
రొజు దిన చర్యలో భాగంగా సాయంత్రం టౌన్(Town) నుండి అబ్దుల్
చచా రాగానే ఒక గంట సైకిల్ తుడవడం అబ్ద్దుల్ చచా పని, ఆ గంట అబ్దుల్
చచాతో గడపటం రాము పని. ఆ సైకిల్ ను అబ్దుల్ చచా తుడుస్తూంటే ఆ సైకిల్ కు ఎంత
అదృష్టం దానికి ప్రతి రొజు శుభ్రంగా తుడిపించుకునే భాగ్యం అని రాము అనుకునేవాడు, అబ్దుల్ చచా
సైకిల్ ను తుడుస్తూ ఉంటే రాము ను సూతి మెత్తని పట్టు గుడ్డతో అబ్దుల్ చచా తనను
తుడుస్తున్నట్లు పరవశించి పోయేవాడు, చచాతో గడిపే ఆ గంట
రాముకు ఒక మత్తులో పరవశించి పోయినట్లు ఊగుతూ ఉండేవాడు చచా ఏదో ఒక కథ రాముకు
చెప్పుతునే ఉండేవాడు మద్య మద్యన చచాకు ఏదైన
అవసరం అయితే అందిస్తు ఉండేవాడు. ఒక రొజు రాము ఉండి చచా ఎందుకు ఈ సైకిల్ అంటే నీకు
ఇంత ఇష్టం అని అడిగితే చచా ఉండి , బెటా ఈ సైకిల్ నా మొదటి
ఆస్తి ఇది నా స్వంత డబ్బులతో కొనుకున్నది ఈ సైకిల్ అంటే నా జీవితం, ఈ రొజు నా
కుటుంబాన్ని కాపాడుకుంటున్న అంటే ఈ సైకిల్ సురక్షితంగా నన్ను నా వ్యాపారన్ని
నడిపిస్తుంది దీనిని ఎంత శుభ్రంగ, ఎంత జాగ్రతగా చూసుకుంటే
నా జీవితంలో కొంత శ్రమ తగ్గి, నా కుటుంబానికి నేను
ఎక్కువ రోజులు సేవ చేసే బాగ్యం నాకు నా సైకిల్ కల్పిస్తుంది. ఇది అంత చచా చెపుతూ
ఉంటే 12.సం. రాముకు ఒక యోగి (Saint) మాట్లాడుతూ
ఉన్నట్లుగా ఉంది. ఈ రకంగా రాము చచాతో గడిపే ఆ గంట మంచి నీతి బోదలు, అల్లా god మనకు
చేసే మంచి గూర్చి ,చిన్న చిన్న కథలు story చెప్పతు ఉండేవాడు ఆ రకంగా రాము 10 వ. తరగతి అయిపోయి కాలేజి చదువుకు హైదరాబాద్ కు
వెళ్లాల్సి వచ్చింది.
అ రకంగా చచాకు రాముకు
మద్యన ధురం ఆ రొజు నుండి పెరిగింది చచా కూడా ప్రతి రొజు రాముతో గడిపే ఆ క్షణలను
తలుచుకుంటూ గడిపేవాడు, రాము ఊరు వస్తే మాత్రం
కొన్ని గంటలు చచాతో గడిపేవాడు. రాము కాలేజి డిగ్రీ చదువు అయిపోయింది, ఉద్యోగ
అన్వేషణలో ఉన్నాడు, చచాకు వంట్లో శక్తి
క్షీణించిది, డబ్బల్ రొట్టెల(Bread) వ్యాపారం మనుకున్నాడు
ఇంట్లోనే ఉంటున్నాడు. గౌర్నమెంట్(Government) ఇచ్చే వృద్దప్యా పింక్షన్ ( Old age pension), ఆసరా
ఫిక్షన్ తో, భార్య భర్తలుకు
వచ్చే పింక్షన్, కూపన్ బియ్యము, పప్పుల తో
జీవితలను సాగిస్తున్నారు. చచా కొడుకు కూడా ఆర్దికంగా అంతంత మాత్రమే కాబట్టి జీవితాన్ని
అలనెట్టుకొస్తున్నాడు, ఆ స్థితిలో కూడ ప్రతి
రోజు ఒక గంట ఆ సైకిల్ ను తుడుస్తూ తను పడుకునే మంచం పక్కనే తన సైకిల్ స్థానం, తను అ మంచం
ప్రక్కనే ఉన్న సైకిల్ ను చూసుకుంటు ఆ సైకిల్ తో గడిపిన తన జ్ఞాపకాలను నెమరు
వేసుకుంటూ నిద్రలోకి జారుకునేవాడు .
అబ్దుల్ చచా వ్యాపారం మానెయ్యడం రాముకు ఉద్యోగం రావడం ఒకే సం. లో
జరిగాయి, ఎప్పుడు ఊరు వచ్చిన అబ్దుల్ చచాతో ఒక గంట
గడపడం తను చెప్పే మాటలు వినడం రాముకు జరుగుతూనే ఉండేది, ఎప్పుడు రాము
చాచని కలిసిన ఒక 1000/- రూ. చచాకు ఇస్తూండేవాడు చచా రాముతో నేను తీసుకొను అనేవాడు
దానికి రాము చచా నేను ఈ రోజు జీవితంలో స్టిర పడ్డాను అంటే నీవు చెప్పిన నిజాయితీ
మాటలు నీవు చెప్పిన నితీ కథలే నా ఈ రోజు నా జీవితం చచా నేను నీకు ఇవ్వడం నా భాద్యత
చచా అనే వాడు రాము. రాము నా జీవితం మొత్తం ఆర్దిక ఇబ్బందులే నాకు ఎందుకో డబ్బు
అంటే ఏమాత్రం వ్యామోహం లేదు, డబ్బు సంపాదించాలి అనే
ఆలోచన ఎప్పుడు రాలేదు, ఆ ఆలోచన వస్తే నా
ప్రయాణంలో ఎక్కడ తప్పు చేయవలసి వస్తుందో అని ఎప్పుడు ఆ సంపాదన అనేది నాజీవితంలో
లేదు, దానికి నేను నా భార్య పిల్లలని చాల
కష్టపెట్టి అసమర్ద తండ్రిగా మిగిలను, కానీ ఈ రోజు నా
మాటలను అమలులో పెట్టి నీవు నా జీవితాన్ని
ఆదర్శంగాInspire తీసుకోని నీవు గొప్పగా ఎదిగావు అంటే నా జన్మ సార్దకము చేశావు రాము, నా వల్ల ఒక
జీవితం గొప్పగా ఎదిగింది అనేది చాలు | కానీ రాము నీవు
ఇచ్చే ఈ డబ్బులు నా అంతిమ యాత్రకు మాత్రమే వాడమని నా భార్యకు చెప్పుతాను, దాని నుండి
ఒక్క రూపాయి కూడ నేను బ్రతికి ఉండగా వాడుకొను అని తన భార్య మొందే అన్నాడు. ఆ
తర్వాత కొద్ది సేపు రాము చచాతో గడిపి తను వల్ల ఇంటికి వెల్లి మరుసటి రోజు ఉదయం తన
ఉద్యోగం చేసే ఊరికి వెళ్లిపోయాడు, ఆ రకంగా 3.సం. కాలం గడిసింది
రాము వచ్చినప్పుడు చాచని కలుస్తూనే ఉన్నడు, చచా కూడ వయస్సు
రీత్యా శక్తి క్షీణిస్తుంది.
ఒక రోజు అబ్దుల్ చచా
మంచంపైనుండి లెవడానికి ప్రయత్నించినాడు కాని తన వల్ల కావడం లేదు తన శరీరం మనస్సుకు
సహకరించడం లేదు, మరుసటి రోజు శుక్రవారం తన భార్యతో కూతుర్లని
కొడుకులని వారి భార్య పిల్లలతో ఈ రోజు సాయంత్రం వరకు రమ్మను అని చెప్పడు, మరియు రామును
కూడా రమ్మని తనని కూడా చూడాలి అన్నడు, అదే రోజు
రాత్రి వరకు అందరు వచ్చినారు. రాము మాత్రం రేపు ఉదయం వస్తాడట, ఈ రోజు తన
ఆఫీసులో ఆలస్యం అవుతుంది అని కబురు ఇచ్ఛడు అని చచా భార్య తనతో చెప్పింది, తన వాళ్లందరిని
అబ్బుల్ చచా కళ్ళారా చూసుకున్నాడు, అందరితో ఈ రోజు ఎవ్వరు
వెళ్ళకండి రేపు మద్యానం 1.గం.వరకు ఉండండి అని ఆందరితో ప్రేమతో కూడిన చూపులతో
చూస్తున్నాడు చెయ్యితో తన ప్రక్కనే
కూర్చున్న భార్య చేతిని గట్టిగా పట్టుకొని తన మానవండ్లని మానవరాళ్లని, కూతుర్లని, కోడండ్లు, అల్లుండళ్ళు, కుమారులని తనివి
తీర చూసుకున్నాడు అందరిని బోజనాలు చేసి పడుకోండి అన్నడు.
మరునాటి ఉదయం లేసి తన
పిల్లల సహాయంతో స్నానం చేసి నమాజ్ చేసుకొని లాచ్చి, పైజమా వేసుకొని
టోపీ పెట్టుకొని మంచంపై కూర్చునాడు. అప్పుడే రాము వచ్చినాడు రామును తన దగ్గరగా
మంచంపై కూర్చో అని రాముతో చెప్పడు. అబ్దుల్
చచా మంచంపై పడుకొని ఉన్నడు, ఒక సారి పిల్లల అందరిని
తన దగ్గర కుర్చోండి అని అన్నడు రాముతో, రాము నీవు ఒక ఆఫీసర్
వు నీవు ఒక చిన్న పని చేయలి అని అన్నడు, దానికి రాము
ఏంటి చచా నేను ఎప్పుడు నీ రామునే చచా అని
అబ్దుల్ చచా చేయిని తన చేతుల్లోకి తీసుకున్నాడు, అప్పుడు చచా
లల్చి జేబులో నుండి చేతి రుమలును రాము చేతిలో పెట్టి రాము ఒక్క సారి నా సైకిల్ ను
ఈ రుమల్ తో శుబ్రంగా తుడువవు, నాకు చేత కాక ఇమద్య
ఒక్క పది రోజుల నుండి తుడువలేదు దానిపై అంత ధూమ్ము పడింది అన్నడు. రాము కండ్లల్లో
నుండి కన్నీటి చుక్కలు కారి చచా చేతులు తడుస్తున్నవి, ఈ చచాకు ఆ సైకిల్ అంటే ఎంత ప్రేమ ఒక వస్తువును
ఇంత పిచ్చిగా ప్రేమించే మనస్సు ఉన్న మనిషితో గడిపిన నా జీవితంలో ప్రతి క్షణం ఒక
గొప్ప కావ్యమే, అని మనస్సులోనే అనుకోని, రాము శుబ్రంగా
సైకిల్ ను తుడిచి చచా వంక చూసాడు రాము ఒక్క సారి ఆ సైకిల్ సిట్ కవర్ ఇప్పి అందులో
ఏముందో తీసుకరా అని అన్నడు.
రాము సిట్ కవర్ ఇప్పి చూడగ అందులో డబ్బు ఉంది. ఆ డబ్బుల కవర్
తీసి చచా చేతిలో పెట్టడు ఆ డబ్బులు చూసిన ప్రతి వారు ఆచర్యపోయారు, చచా భార్య తప్ప, చచా ఆ డబ్బులను
తన పెద్ద బాబు చేతుల్లో పెట్టి ఈ డబ్బు ఒక లక్ష 50 వేలు ఉన్నవి, ఇది అంత నా
సంపాదన కాదు ఇది మొత్తం రాము నాకు ఇచ్చినది ఈ డబ్బుతో నా అంతిమ సంస్కారణాలు చేసి
మిగిలినదానితో మీ అమ్మను జాగ్రతగ చూసుకోడి. అని తన భార్య చేతిని తన పిల్లల
చేతుల్లో పెట్టి బెటా నా జీవితంలో మీ అమ్మను ఏ రోజు సంతోషంగా చూసుకోలేదు తను ఉన్న
దాంట్లోనే మిమ్మల్ని పెంచింది తన జీవితం మొత్తం నా ఆశయం నా నిజాయితీ జీవితనికే
అంకితమైంది, నేను మీకు ఏ ఆస్తులు సంకుర్చలేక పోయాను. భాహుశ్య
నేను ఒక సగటు మనిషిగా ఈ సంజంలో జీవించలేక పోయాను నా వల్ల మీ జీవితాలలో ఏ మంచి జరగక
పోయిన చెడు మాత్రం జరగలేదు అని భావిస్తున్నాను, అని చెప్పి
రాము నువ్వు పుట్టిన నుండి నీకు నాకు ఏ అనుబందమో ఉంది చిన్నప్పుడు మీ అమ్మ ఏ పనిమీద బయటికి
వెల్లిన నేను ఇంట్లో ఉంటే నిన్ను నాకు ఇచ్చి వెళ్ళేది చిన్నపటి నుండి నీవు మా
ఇంట్లో పిల్లవాడిగానే పెరిగావు, నీ 5 వ ఏట నుండి నువ్వు
ప్రతి రోజు సాయంత్రం ఒక గంట నాతో గడిపే వాడివి ఇది ఏ జన్మ అనుబందమో రాము అని అంటూ
బెటా, బిబి, రాము నన్ను అల్లా పిలుస్తున్నాడు అంటు ఒక చెయ్యి
మంచం ప్రక్కనే ఉన్న సైకిల్ పై చెయ్యి వేసి ఆ సైకిల్ నే చూస్తున్న కళ్ళు, ఆ కళ్ళు అట్లే
తెరుచుకొని ఉన్నవి, ఆ సైకిల్ ను చూస్తూ
అబ్దుల్ చచా అనంతలోకాల ప్రయాణం మొదలైంది.
ఆ తర్వాత చచా కుటుంబాన్ని అడిగి అబ్దుల్ చచా సైకిల్ ను రాము తనతో
పాటు తీసుకొనివచ్చి తన ఇంట్లో హాల్ లో ఒక గ్లాస్ బాక్స్ చేయించి అందులో సైకిల్ ను పెట్టడు.
రాముకు మనస్సులో ఏ మాత్రం కలతగా ఉన్న ఆ సైకిల్ ను చూస్తూ ఒక గంట గడిపేస్తాడు, ఆ సైకిల్ తనకు
చచా ప్రతి మాటను గుర్తు చేస్తున్నట్లే అని పిస్తూండేది. రాము ఉద్యోగంలో ఎన్ని
సమస్యలు వచ్చిన ఎలాంటి ఆదికర, రాజకీయ, వత్తిడీలు
వచ్చిన, అబ్దల్ చచా ను మనస్సులో తలచుకుంటాడు. చచా
నేర్పిన నిజాయితీ, నిబద్దత కథలే ఈ రోజు రాష్టా
ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా జాతియ్య స్థాయిలో అవార్డు రావడం జరిగింది. ఈ కథ అంత
పత్రికల వారు, రాము గారు ఈ జాతియ్య స్థాయి ఆవార్డుకు మీకు స్పూర్తి Inspireation ఎవరు అనే ప్రశ్నకు రాము జీవిత విజయనికి
స్పూర్తి దాత జీవన విదానంలో నీతి , నిజాయితీ ,నిబద్దత తో
కూడిన ప్రయాణమే ఈ కథ.
స్వస్తి |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి