ప్రతి మనిషి జీవన ప్రయాణం
LIFE JOURNEY OF EVERY MAN
పసితనం
వర్షం
వెలసిన తర్వాత కాగితలని పడవలుగా చేసి కాలువల వెంటపడ్డ పసితనం మనది, కిటికీలో కూర్చొని బయట ఆడుకుంటున్న మన వయస్సు పిల్లలని చూసి కేరింతలతో చప్పట్లు
కొట్టే వయస్సుమనది.
దండెమ్ మీద ఉయ్యాల ఊగుతున్న పిచ్చుకలను చూసి
ఆనంద పడిన క్షణలు మనవి.
వర్షం పడుతుంటే తలమీద అమ్మకొంగు కప్పుకొని చినుకులకు
చిట్టి చేతులు చాపి రోడ్డు అంత ఒకటే ఆట. వర్షం వెలిసిపోయిన తర్వాత అమ్మ తడిసిపోయి కూడా
మన తల మీది నుండి కొంగు తీయకుండా భద్రంగా ఇంట్లోకి చేర్చిన క్షణలు.
గొంతు అలలమీద ఘంటసాల
పాటలు, అలా సంగీత సముద్రంలో మునకలు.
బాల్యం
కాంతరావు కత్తి యుద్దాలు చూడటానికి వారాల తరబడి
నిరీక్షణ.
వేసవి కాలం సెలవులు, ఆవకాయ గుబాళింపులు,
ముంజేలు, మావిళ్ళ
రుచులతో నిండిన ఋతువులు,
సంక్రాంతి చలిమంటలు, దసరా శరన్నవరాత్రులు.
యవ్వనం
ఒనీలు, పరికినిలు, పిల్లకాలువలు, మేనామరదళ్లు,
కొత్తగా పొట్లం విప్పిన
ఉద్వేగ సమయాలు,
చదువులు, ఉద్యగాలు, పెళ్లిలు, పురుళ్ళు, పుణ్యాలు.
ఉద్యోగం
ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగం, వచ్చిన తర్వాత సద్యోగం, చాలి చాలని జీతం, అంది అందని పదోన్నతులు , అప్పుడప్పుడు చిరు కలతలు ఎప్పుడో
ఒకప్పుడు చిరిగి చాట అయ్యే గొడవలు, ఈ రకమైన ఉద్యోగ ప్రయాణంలో
ఒకటో అరో ప్రమోషన్, ఆ సంతోషం తీరి తీరక మునుపే, పార్టీ ఎప్పుడు అని అడిగే సహ ఉద్యోగులు, పార్టీ ఏమిటి
ఎందుకు అనేలోపే, నీ రిటైర్ మేంట్ త్వరలోనే ఆట కదా అని మరో సహ
ఉద్యోగి పలకరింపు.
ఓ అప్పుడే 60 వసంతలు
పూర్తి అయినయ అని మనస్సు పొరల్లో అంతర్ మధనం.
వర్దక్యం
ఉద్యోగ విరమణ ఆ తర్వాత
ఏ పని చేయాలో తెలియని స్థితి.
మానవడితో మన అనుభవాలు
పంచుకుందమంటే, పో తాతయ్య నీవు మీ కాలం మాటలు మాట్లాడుతావు
నాకు ఏమి అర్దం కావు అని సున్నితంగా తిరస్కరించే మనవడు.
ఏదైన సలహా చెప్పుదామంటే
ఏంటీ నాన ఏదో కృష్ణ రామ అని ఇంట్లో తృప్తిగా కూర్చో ఇకనైనా విశ్రాంతి తీసుకో అని సౌమ్యంగా
మందలించే కొడుకు ,కోడలు.
విటంన్నింటి కంటే ఒంటరి తనమే మేలు అని ఒంటరిగా
అలవాటైన జీవితం . అందులో భాల్యం నుండి ఉద్యోగ విరమణ వరకు గత స్మృతులని నెమరు వేసుకుంటు
జీవన ప్రయాణం.
ఈ రకమైన స్మృతులలోనే ఆ ఆకాశంలో ఏదో ప్రకాశం
ఆ ప్రకాశంలో ఒక తేజస్సు విలీనం .
స్వస్తి
చివరి
వరకు చదివినందుకు దాన్యవాదాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి