How to Human Relations are Depending on Money
ఆ సమయం ప్రొద్దుగూటిలో పడే సమయం. ఆకాశంలో పక్షులు అన్ని
తమతమ గూటికి చేరడానికి తిరుగుప్రయాణంలో వున్నవి అక్కడక్కడ చెట్లపై పక్షుల అలజడి
అవుతుంది. వీధుల్లో ఆవులు గేదలు వాటి పిల్లలను చూడాలనే ఆత్రుతతో వేగంగా
నడుస్తున్నవి, వ్యవసాయానికి వెళ్ళిన కూలివాళ్లు తిరుగు ప్రయాణంలో
వున్నారు. అందులో కొందరు నన్ను మంధలిస్తు వెళ్ళుతున్నారు మరికొందరు ఈ ముసలిదానితో
ఏమి పనిలే అన్నట్టు తలప్రక్కకు త్రిప్పుకొని వెళ్ళుచున్నారు.
నేను మాత్రం ఎవరిగురించి
ఎదురు చూడటంలేదు, ఎవరు నా ఇంటికి వచ్చేవారు లేరు ఎందుకంటే నేను ఒంటరి
ముసలిదాన్ని. కన్నపిల్లలలో మానవత్వం నశిస్తే నాలాంటి ఒంటరి వృద్దులసంఖ్య
పెరుగుతూనే వుంటుంది. నేను పుట్టింది ఒక మగ్గం(Loom)
నేసుకునే పేద ఇంటిలో. అవి రజాకారులకు ముందు అని అనేవారు నా తండ్రి,
నాకు ఇద్దరు చెల్లెలు మాది పేదకుటుంబం కాబట్టి మా ఊరికి 10.కి.మీ. దూరంలో వున్న
మగ్గం (Loom) నేసుకునే మరో కుటంబలోకి పెళ్లి అనే కార్యక్రమంతో
ప్రవేశించను.
నా భర్త మగ్గం(Loom)
నేస్తుంటే నేను అతనికి చేదోడుగా వుంటూ జీవితాన్ని సాగిస్తున్నాము. అప్పుడే నా
కూతురు కడుపులో పడింది, అమ్మాయి పుట్టింది మేము ఉన్నదాంట్లో సర్దుకొని జీవనం
సాగిస్తున్నాము. అమ్మాయిని స్కూల్ కు పంపితే అది ఊర్లో వున్న 5 వ. తరగతి వరకు
చదివి మానేసి నాతోనే తండ్రికి సహాయంగ ఉండేది.
ఇంతలో మరమగ్గలు (Power looms)
మా ఊరులోకి వచ్చినవి. అంతలో మాకు మాలు (loom material) ఇచ్చే సేటు (Owner)
మాలు ఇవ్వడం తగ్గిచినాడు.
ఊరిలో వున్న మగ్గలు నేసే అందరు మరమగ్గల పని నేర్చుకొని అవి నడపడానికి
వెళ్ళుతున్నారు, మా ఆయన మాత్రం అవి నేర్చుకోవడం ఇష్టంలేక తన మగ్గన్ని
వదులుకోలేక ఆయన మాత్రం మారలేదు, అదే మగ్గన్ని నమ్ముకున్నాడు,
ఇంతలో ఇంట్లో పూట గడవడం కష్టంగా మారింది.
నేనే
దైర్యం చేసి మా ఆయనతో అన్నాను నేను మరమగ్గల (Power looms) దగ్గర
కండెలు (shuttle) చుట్టే పని
నేర్చుకొని ఆ పనికి వెళ్ళుతను అని, ఆయన సరే అన్నాడు,
నా మగ్గంలో పూట గడవడం కష్టంగా ఉంది అని ఒప్పుకున్నాడు కానీ తన మనసులో తెలియని బాద,
అది నా మనస్సుకు మాత్రమే తెలుసుకానీ ఇది విది మరియు కాలంలో వచ్చిన మార్పు.
నేను మరమగ్గల సేటు దగ్గరికి
వెళ్ళి పని అడిగి ఆ పనిలో చేరినను ఆ పని కొంతవరకు నాకు వచ్చుకననుక ఆ సేటు నాకు పని
ఇచ్చాడు, ఆ రోజు నుండి రోజు ఉదయం నుండి సాయంత్రం 5.గ.వరకు ఆ
పనికి వెళ్ళేదాన్ని. ఆవిదంగా మా జీవితం మూడు పుటలకు తిండికి,
బట్టకి సరిపోరియే సంపాదన లభించింది.
ఇంతలో నా కూతురు పెద్దమనిషి
అయింది, తర్వాత 2.సం.కు ఒక చిన్న బట్టల వ్యాపారికీ ఇచ్చి పెళ్లి
చేశాము. మా అల్లుడు అక్కడ వున్న చిన్న చిన్న పల్లెటూర్ల తిరుగుతూ బట్టల వ్యాపారం చేసుకునేవాడు.
నా కూతురు పెళ్ళి కార్చులకు కావలసిన 10.వేల.రూ. నేను పని చేసే సేటు(Owner)
దగ్గర అప్పుగా తెచ్చి అమ్మాయి పెళ్లి చేశాము. ఆ అప్పు తిరడానికే నాకు 10.సం,
పట్టింది.
ఇంతలో మా ఆయన మగ్గం నేయడానికి
ఎవరు మాలు ఇచ్చేవారు లేకుండా పోయారు, అసలు ఆ మగ్గం పని
అంటేనే చిన్నచూపు చూస్తున్నారు మరమగ్గల పని చాలా గొప్పగా సాగుతుంది.
మా ఆయన మగ్గం పని మానేసి కూలి
పనులకు వెళ్ళేవాడు. ఆ వయసులో తను మరమగ్గల పని నేర్చుకొను అని కూలిపని చేయసాగారు.
ఒక వృత్తిని నమ్ముకొని జీవించే సగటు మనిషి,
కాలంతో పాటు మరకపోతే మిగిలేది మాలంటి జీవితలే.
ఇంతలో మా ఆయనకు దగ్గు ధమ్ము
అనే వ్యాది మొదలయిది. ఏ పని చేయాలన్న ఎంతో ఇబ్భంది పడేవాడు. ఆసుపత్రికి తీసుకవెళ్ళితే, ఆ
మందులు ప్రతి నెల వాడాలి దానికి చాలానే డబ్బులు ఆయ్యేవి. ఇప్పుడు నా
ఒక్కదానిపై సంసారాభారం పడటం మొదలైయింది.
దానికి తోడు ఆయన మందుల కర్చు, మాలాంటి
పేదవాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడనీ ఈ బ్రతుకులకు ఈ రోగాలు ఇవ్వకూర రామ అని ఆ
దేవుడికి వేడుకోవడం తప్ప.
ఈ లోగా ఆ రోగంతో మా ఆయన
కాలంచేశాడు, దినాలరోజున (10 th. day death ceremony),అందరంవెళ్లి పిట్టకుపెట్టి చెరువులో స్నానంచేసి
వచ్చినము. అందరు భోజనాలు చేశారు, నాకు ఒక్క మెతుకు కూడా నోట్లోకి పోవడంలేదు,
ఆయన జ్ఞాపకాలే, అయంతో పంచుకున్న కష్టలు సుఖాలు గుర్తుకొస్తున్నాయి.
ఇంట్లో వున్న మగ్గం(loom) చూస్తే అందులో ఆయన కూర్చొని మగ్గం నేస్తున్నట్టే
అనిపిస్తుంది. నా బాధ ఎవరితో చెప్పుకొను, ఏదైనా కలిసి
పంచుకునేవాళ్లం తన మనసులో కూడా ఎదివున్న నాతో చెప్పుకునేవాడు,
ఒకరికి ఒకరంగా బ్రతికాము కానీ నన్ను ఒంటరిని చేసి తను మాత్రం వెళ్లిపోయాడు.
నా కూతురు వచ్చి అమ్మ అమ్మ
అని తట్టితే నేను ఆ స్ర్మతులనుండి బయటికి వచ్చాను,
అమ్మ నువ్వు ఒక్కదానివే ఈ ఇంట్లో ఒంటరిగా వుండలేవు,
నీవు కూడా నాతో వచ్చేయ్ మా ఇంట్లోనే వుండి నా పిల్లలతో కాలంగడుపు అని అంటే దానికి
వచ్చిన చుట్టలు కూడా వత్తాసుపలికి నీకు కొడుకులు లేరు,
కొడుకైన కూతురైన అన్ని తానే కదా అందుకని నివువెళ్లి అక్కడే వుండు అని వచ్చిన
బందువులు, నా కూతురు బలవంతంవల్ల నా కూతురు ఇంటికి వెళ్ళినను.
మొదట్లో చాలా ఆప్యాయంగానే
చూసుకున్నారు ఒక రోజు నా కూతురు నా దగ్గరకు వచ్చి అమ్మ నీవు ఇక్కడే వుంటున్నావు
కదా మన ఊరిలో వున్న ఇల్లు ఎవరులేక చెడిపోతుంది,
ఇలాగే ఇంకా కొన్ని సం. ఉంచితే వర్షాలకు ఇల్లు కూలిపోతుంది అందుకని ఆ ఇల్లు అమ్మేసి
ఆ డబ్బులు నీ పేరు మీద బ్యాంక్ లో వెద్దమ్ అంటుంన్నాడు నీ ఆల్లుడు అని అంది.
నాకు కూడా ఉన్నది ఒక్కతే
కూతురు నాకు ఎవ్వరులేరు దానికంటే ఎక్కువగా నా మచిచెడ్డలు చూసేదీ ఎవరని సరేనమ్మా మీ
ఇష్టం అని అన్నాను, అన్న రెండు రోజులలోనే ఇల్లు అమ్మేశారు,
నాతో సంతకాలు తీసుకుంటుంటే ఇంత తొందరగా ఇల్లు అమ్మినరా ఎంతకూ అమ్మినారు అని అంటే ,
50.వేలకు పోయింది రేపు డబ్బులోస్తాయి, రాగానే నిన్ను
తీసుకొని వెళ్ళి బ్యాంక్ లో వేస్తాడు లే అని నా కూతురు అంది. సరే అని వేలిముద్రలు
వేసినాను వారం రోజుల తర్వాత ఏమైంది బిడ్డ,
పైసలు వచ్చినయా బ్యాంక్ లో ఎప్పుడు వేస్తారు అని అడిగితే, ఏ
పైసలు అని నా కూతురు కసురుకుంది, అదే ఇల్లు అమ్మిన పైసలు అంటే,
ఇల్లు ఏంటీ, అది నీ అమ్మగారు ఏమైనా కొని ఇచ్చారా,
అది నా తండ్రిది దాన్ని నేను అమ్ముకున్నాను అని అంది.
తన మాటలకు నా బ్రతుకు
ఏమైతుందో అర్దం కాలేదు, ఏమిటి ఇది నా కూతురెనా అనిపించింది,
అల్లుడిని ఏమైయ్య ఆ ఇల్లు పైసలు నాకు ఇస్తారా అని అడిగితే ఎక్కడి ఇల్లు,
ఎవరి పైసలు, ఏ ముసలిదాన ఇక్కడినుండి వెళ్ళు,
ఎవ్వరితో అనకూ బాగుండదు అని భయపెట్టినాడు. ఏమి చేయాలో అర్దం కాలేదు,
ఇది నా కూతురెనా? నన్ను మోసం చేస్తే దానికి ఎంవస్తుంది. నా దగ్గర చిల్లర
పైసలు కూడా లేకుండ అయినాయి నోట్లో జర్దా(Pan)
వేసుకోవాలన్న డబ్బులు లేవు, ఎవరిని అడగాలి ఏమని అడగాలి అనిపిస్తుంది.
ఇల్లు అమ్మిన నెలలోపే ఇంట్లో
నా పరిస్థితి మరీ దిగజారింది, ఈసడింపులు ఎక్కువ అయినాయి,
ఇల్లు అమ్మినక నా పరిస్థితి అధ్వానంగా మారింది,
ఇంట్లో బట్టలు ఉతకమని నా కూతురు ముందరవేస్తే సరేలే నా కూతురు వాళ్ళ పిల్లలవే కదా
అని ఉతుకుతున్నాను. అంట్లు తోముతున్నాను అయిన ఏమి అనుకోలేదు రాత్రి మిగిలిన అన్నం
తినమని నాముందు పెడుతుంది ఎవరోకాదు నా కూతురు,
అప్పుడు అనిపించింది ఇదేనా తల్లీకూతుర్ల అనుబందం,
దానికి చిన్నప్పుడు ఏరోజు చద్దన్నం పెట్టలేదు,
ఇక నా చాప ఇంట్లో నుండి వాకిట్లోకి వచ్చింది,
ఏంటీ బిడ్డా ఈ చలికి ఎలా బయట పడుకోవాలి అని అంటే ఏం చస్తావా ఈ చలికి ఏమి చావవులే
నాకు శనిలా దాపురించింది అంట్టు నా పక్క బట్టలు మోహనకొట్టింది.
అప్పుడు అర్దమైయింది ఇన్ని
రోజులు నన్ను చూసుకొంది నా ఇల్లు అమ్మడానికి అని, ఆ
ఇల్లు అమ్మగానే నేను బరువయ్యాను, చాలా భాదగా అనిపించింది. ఆ చలికి రాత్రి ఎంతకి
నిద్రపట్టలేదు, కంట్లో నుండి నీరు కారుతూనే వుంది,
నా భర్తతోపాటు నేను చనిపోయినా బాగుండును అనిపించింది. ఏమి చేయాలి,
ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అనిపించింది ఇవ్వన్ని నన్ను ఇంట్లో నుండి
వెళ్లగొట్టడానికే అని అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. ఎంత దారుణం కన్న కూతురే ఇలా
చూడటం. ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాను.
తెల్లవారుజామున 3.గం. కు లేచి
నా బట్టల మూటపట్టుకొని మా ఊరికి వచ్చేశాను,
నా భర్త చనిపోయిన 3 నెలలకే తిరిగి మా ఊరు వచ్చాను. ఏమి చేయాలో తోయలేదు,
చింత చెట్టుక్రింద కూర్చునను తెల్లవారింది,
వచ్చి వెళ్ళేవారు అందరు అడుగుతున్నారు ఏమైంది ఆక్క అని,
వారందరికి నా ఏడుపే సమాదానమైంది. మా పక్కింటి లక్ష్మి కూడా వచ్చింది,
తను నేను అక్కా చెల్లళ్లుగా ఉండేవాళ్లం తను రాగానే నా ఏడుపు ఆగలేదు తనను పట్టుకొని
ఏడ్చేశాను నన్ను తన ఇంటికి తీసుకెళ్లి అక్కా ఏమి జరిగిందో నాకు చెప్పు నాకు
చేతనయిన సహాయం చేస్తాను నువ్వు నాకు చాలా సహాయం చేశావు అని అంది. లక్ష్మి ఇచ్చిన
హోదార్పుకు నాకు దైర్యన్ని ఇచ్చింది.
నా కూతురు ఎలా మాట్లాడింది, ఈ
3 నెలలు జరిగిన విషయాలన్నీ చెప్పాను, అక్కా నిన్ను
తీసుకవెల్లిందే ని ఇల్లు అమ్మడానికి, ఆ ఇల్లు కూడా ఒక
లక్షకు అమ్మరు, నీకు ఆ పైసలు ఇవ్వాల్సి వస్తుందని నిన్ను సాకల్సి (responsibility) వస్తుందని ఇంట్లో నుండి నిన్ను పంపిoచారు.
నీవు ఏమి బాదపడకు నీవు నా ఇంట్లో వుండు అంది,
వద్దని చెప్పినాను 500 రూ. అప్పుగా ఇవ్వు ఆరు నెలల తర్వాత ఇస్తాను, ఈ
ఊరిలోనే ఎవరి ఇంట్లోనైనా కిరాయికి వుంటా
మళ్ళీ పాత సేటు దగ్గర పని చేస్తాను అని అన్నాను.
అలా లక్ష్మి 500 రూ. ఇచ్చింది,
తన ఇంట్లోనే ఒక గదిలో వుండమని కిరాయి వద్దని చెప్పింది. ఆ డబ్బు తీసుకొని పక్కనే
వున్న టౌన్ కు వెళ్ళి, ఒక కిరసనయిల్ స్టౌ,
వంట గిన్నెలు, కిరణాసామను, బియ్యం కొనుక్కొని
మా ఊరు వచ్చాను. నా మరో జీవితం ప్రారంబించాను,
మా పాత సేటు దగ్గరికి వెళితే నన్ను చూసి నాకథ ఎవరోచెప్తే విన్నాడట,
అతడు పని ఇచ్చాడు.
ఆ కార్ఖానాలో నాతో కలసి
10.మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు, లక్ష్మి ఇచ్చిన 500 రూ. అప్పు తిరిగీచ్చాను నెలకు ఓ 3, 4
వందలు మిగులుతున్నవి వాటితో ఒక సేటు దగ్గర చిన్న చిట్టి వేశాను నేను నా కూతురు
నుండి తిరిగి వచ్చి 1.సం. గడిచినా ఒక్కరోజు కూడా నా గురించి నా కూతురుగాని,
అల్లుడు గాని వారి పిల్లలుగాని నా దగ్గరికి రాలేదు,
నేను బ్రతికి వున్ననా లేదా అని కూడా వాళ్ళకు అవసరం లేకుండా పోయింది.
ఆ సం.లో ప్రభుత్వంవారు ఇల్లులేనివారికి
భూమి ఇస్తున్నారు అని అందరు అంటే నేను కూడా గవర్నమెంట్ ఆఫీసర్ ను కలిసి నాకు ఎవరు
లేరు, ఇల్లు లేదు అని చెపితే నా పేరు కూడా రాశారు. ఆ ఆఫీసర్
నీకు ఇల్లు స్థలం ఇస్తే ఇల్లుకట్టుకుంటావా లేదా వేరేవారికి అమ్ముకుంటావా,
లేకపోతే వేరేవాళ్ళకు ఇస్తారు అంటే, సరే సర్ ఒక చిన్న రేకుల ఇల్లు వేసుకుంటా నంటే సరే
అన్నాడు. 6 నెలల్లో ఆ భూమి ఇచ్చారు నాకు వచ్చిన చిట్టి డబ్బులతో నాలుగు రేకులతో ఒక
చిన్న గది కట్టించుకున్నాను అప్పటినుండి నాకు మళ్ళీ స్వంతంగా ఇల్లు,
నా స్వయం కాష్ఠర్జితంతో కట్టించుకున్నానని చాలా సంతోషంగా ఆ ఇంట్లో నేను ఆ రోజు
నిద్రపోయాను.
మా ఊరిలో ఏ బజార్ వెళ్ళిన
మరమగ్గల (Power looms) చప్పుడే వినిపించేది. ఎక్కడ చూసిన వాటిలో పనిచేసేవారే
అటు ఇటు తిరుగుతూ వుంటారు. సాయంత్రం అయితే చాలు దుకాణాల దగ్గర మద్యం ధుకణాల దగ్గర
అయితే బారులు తీరేవారు, జనలతో ఊరంతా ఒక్కటే సందడి.
అనుకోకుండా కొద్దిరోజులుగా
మరమగ్గల చప్పుడు తగ్గిపోయింది, దానికి కారణం కారంట్ కోతలు చుట్టూ ఏ ఊరు చూసిన అదే మాట
కరెంట్ కోత, రోజురోజుకూ పెరుగుతుంది. మరమగ్గలు నడిపే కూలీలకు రోజు
కూలి కూడా పడటంలేదు కోదరు భార్యాపిల్లను తీసుకొని పట్నం బాట పడుతున్నారు. మా సేటు
మాత్రం ఎంతో కొంత నడిపిస్తునాడు, ఆరునెలల్లో ఊరిలో చాలా మార్పులు వచ్చాయి,
ఎక్కడచూసిన జనసంచారం తగ్గింది ఊళ్ళో వున్న అన్ని దుకాణాదారులు జనాలు లేక దివాలా
తీశారు.
ఒక రోజు మాసేటు (Industry owner) దగ్గర పని చేసి పనివల్ల అందరిని
పిలిచిండు, అందరం కలిసి 50.మంది అయినారు. అందులో ఆడవారు 20 మంది
మగవాళ్ళు 30 మంది, అందరిని కూర్చోండి అని తను మాట్లాడుతున్నాడు చూడండి
కరెంట్ కోతలు ప్రారంభమయి 6 నెలలు అయింది. ఈ ఆరు నెలలు నడిచినా,
నడవకున్నా మీకు జీతాలు ఇస్తున్నా, ఇప్పటికే నాకు చాలా నష్టం వచ్చింది,
ఇంక నేను భరించే స్థితిలో లేను, మీ అందరి కృషి తోడ్పాటువల్ల నేను కూడా ఎంతో కొంత
సంపాదించను, దానితోనే ఈ ఆరునెలలు నష్టంవచ్చిన మీకు జీతాలు ఇచ్చాను,
దయచేసి నన్ను అర్దం చేసుకొని మీరు వేరే పనిలోకి వెళ్ళండి,
మీ అందరికి ఒక్కొకరికి 5000/- రూ.నా తరుపున ఇస్తున్నాను. మీ జీతంతోపాటు ఈ 5000/-
అదనంగా ఇస్తున్న ఈ లోపు మీరు ఏదో ఒకపనిలో చేరండి అని,
నేను కూడా ఈ మరమగ్గలు (Power
looms) బొంబాయి మార్వాడికి
అమ్మివేస్తునా అతను ఇచ్చిన డబ్బుతో ఏదో ఒక ధుకణం పట్టణంలో పెట్టుకొని బ్రతకాలి,
నేను ఇంతకంటే ఎక్కువ ఏమి చేయలేను అని చెప్పాడు.
ఆ క్షణంలో నాకు ఏమి అర్దం
కాలేదు నేను ఏమి చేయాలి ఏ పని రాదు కూలిపనికి పోదామన్న ఆ పనులు రావు మళ్ళీ నాకు
లక్ష్మి తోడుగా ఉంది. అక్కా దిగులు పడకు అని నాకు వ్యవసాయం పనులు నేర్పించింది,
లక్ష్మి సహకారంతో వరి నాట్లు వేయడం వరి కోతకోయడం,
కలుపు తీయడం లాంటివి నేర్కుకున్న, రోజు కూలికి పోతూ కాలం గడుపుతున్నాను. ఒకరోజు
కోతకొస్తుండగా కళ్ళు తిరిగి చేల్లో పడిపోయాను అప్పటికి నాకు చాతకావడం తగ్గింది.
మెల్లగా వ్యవసాయ కూలికి పిలిచేవారు పిలవడం తగ్గిస్తున్నారు,
నేను వస్తానంటే, నీకు ఎక్కడ చేతనవుతుంది ఇంట్లో కూర్చో అని అంటున్నారు.
మెల్ల మెల్లగా ఏ పని చేస్తా అన్నా వద్దమ్మ నీవు ఎక్కడైనా పడిపోతే, ఏ
కాలొ, చేయో విరిగితే నీకు ఎవరు చేస్తారు చెప్పు పైగా మేము
బాదనమ్ అవుతాం అని అంటున్నారు.
అప్పుడు నా జీవిత ఆధారం
సర్కారు ఇచ్చే వృదాప్య ఫించను 500/- రూ. 2.రూ. కిలో బియ్యం. ఇప్పుడు అవే లేకపోతే ఈ
కట్టే ఎప్పుడో మట్టిలో కలిసిపోయేది. ఏది ఏమైనా నా లాంటి దిక్కు మొక్కు లేని
వాళ్ళకు ఈ సర్కారే దిక్కుగా ఇప్పుడు ఉన్నది.
నేను నా కూతుర్ను విడిచి
వచ్చి 20.సం. గడిచింది ఈ 20.సం. ఒక్కసారి కూడా నన్ను చూడటానికి కూడా రాలేదు,
ఒకరోజు నా కూతురు కొడుకు (grandson) వచ్చి అమ్మమ నీవు మా ఇంటికి రా మేము మంచిగా చూసుకుటం,
అని వస్తే వద్దు నాయిన, నేను రాను ఉన్నదట్లో ఏదో తిని నా బ్రతుకు నేను
బ్రతుకుతాను అని నా మానువన్నీ పంపించను.
ఏది ఏమైనా ఈ ప్రపంచంలో మానత్వం కంటే డబ్బులు ఎక్కువ విలువ అయినాయి. ఈ రోజులలో ఎవరికి ఎవరు తోడు లేరు ప్రేమ లేదు [ఎక్కడో లక్ష్మి లాంటి వాళ్ళు కోటికి ఒక్కరూ] అంత డబ్బు మాయం. రోజు వాకిట్లో కూర్చొని వచ్చి వెళ్ళేవారిని మాట్లాడిస్తూ నా జీవితం గడుపుతున్న, చీకటి పడింది అంటే నా జీవితం మళ్ళీ ఒంటరి, నేను నా ఇల్లు, ఈ జీవితం ఇంకా ఎన్ని రోజులో ఆ భగవంతుడు ఈ ప్రాణం ఎప్పుడు తీసుకొని వెలుతాడో.
చివరి
వరకు చదివినందుకు దన్యవాదాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి