ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Poems

Central Jobs Notification

 https://youtu.be/eTsWaD4Nc3Q

Soul story ఒక ఆత్మ పగ

 

Soul story

ఒక ఆత్మ పగ

నేను ఒక భిక్షమెత్తుకొని తిరిగే దేశ దిమ్మరిని, ఎవరు లేని అనాధని. ఏ వూర్లో ఉంటానో ఏ రాత్రి ఎక్కడ ఉంటానో ఏ రాత్రి ఎక్కడ ఉండనో తెలియని ముసలి బ్రతుకు. ఒక రోజు ఒక పట్టణం నుండి ఒక వూరికి బయలుదేరాను, బహుశా ఊర్లో వున్న జనాలు వాడే వంటకాలరుచులు చాలా రుచికరంగా ఉండటం వల్ల కాబోలు, నా నాలుక ఆ రుచులకు అలవాటుపడి, పట్టణ వంటల మీద నుండి ఊళ్ళకు  వెళ్ళాలీ  అని నా మనస్సు గాలి మల్లినప్పుడు కావొచ్చు, పట్టణలో పైసలు వేస్తారు ఆ పైసలతో ఏదో ఒక హోటల్లో ఏదో ఒకటి కొనుకొని లేదా అడుక్కోని ఆ రోజు గడపాలి, కానీ ఊళ్ళల్లో పైసలు తక్కువ రుచికరమైన   భోజనము ఎక్కువ ఏ ఇంటి ముందుకు వెళ్ళిన ఏదో ఒక్క బోజనము లేదా కూరలో వేసి నా ముసలి ప్రాణాన్ని కాపాడేస్తారు చిన్న పిల్లలు కొందరు భయపడి పారిపోతారు కొందరు భయంగా తల్లి చాటునుండి చూస్తువుంటారు.

earches, related, to, a, soul, story


 ఆ రోజు బయలు దేరిన వూరికి రాత్రి 2.గం. సమయంలో ఊరు చేరుచుండగా ఊర్లో  నుండి వీధి దీపాలు మినుకు మినుకు మంటూ ఆగుపిస్తున్నవి ఇంకా ఒక కి.మీ. నడిస్తే వూర్లోకి వెల్లవచ్చు, కానీ ఆ రాత్రి ఊర్లో కి  వెళ్ళి ఏ అరుగుమిద పడుకున్న చూసినవాళ్ళ తో చీవాట్లు తినాలి, లేదా ఆ ఊరి ప్రవేశంతో కుక్కల అరుపులతో ఎవరో ఒక్కరూ లేస్తారు అని అది బహుశా ఆ ఊరి స్మశానవాటిక అయి ఉంటుంది అనుకుంటా ఆ వెన్నేల చీకట్లో రోడ్డు ప్రక్కగా ఒక బల్ల పరుపుగా ఓ పది మంది  పడుకునే చాపల(Bed sheet) వెడల్పులో ఉండే బండ ఉన్నది.  అక్కడి వరకు నడవగానే నా ముసలి ప్రాణం అలసిపోయింది ఆ బండ మీద కూర్చోవడానికి చేతికర్ర సాయంతో కూర్చొని భుజానికి ఉన్న నా మూటని ఒక జోలె  సంఛీని పక్కకి పెట్టి పడుకొని తలపైకి చూసాను ఈ తల నిలుచున్నపుడు పైకి ఎత్తి  ఆకాశాన్ని చూసి ఒక 10 సం. కావొచ్చు అలా వెన్నెల ఆకాశాన్ని, ఆ ఆకాశంలో చందమామను చూస్తూ నిద్రపోతున్నాను.

        నిద్రలోకి జారుకున్నాను అంతలో, ఒక ఏదో తెలియని బరువు వచ్చి నాపైన పడుతుంది ఊపిరి ఆగి పోతున్నంత బరువు ఒక్క సరిగా నాప్రాణం తీసుకెళ్లడానికి వచ్చిన యమకింకరులేమోలే తీసుకెళ్లరా యమ రాజ ఇంక్క ఎన్ని సం. ఈ శరీరాన్ని మోస్తు ఈ అడుక్కతినే బాధ,  ఈ 70 సం. వయస్సులో ఎందుకు ఈ కష్టం  నాకు విముక్తి ఇవ్వు అని నా ఆత్మ ఘోశిస్తుంది అనుకుంటూ అంతలో అప్రయత్నంగానే  నా చేయి నా చేతిమీద ఉన్న బరువును తోసివేసింది అంతలో ఏ తాత తాత, ఏ తాత లే ఆనే పిలుపు ఎవరు ఆని కళ్ళు తెరిచి చూసాను ఎక్కడ ఎవరు లేరు, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను, ఏ ముసలోడా  లేరా ఇధి నా బండ ఆనే పిలుపు కు లేసి కూర్చొని చుట్టూ చూసిన అరె ఇది కల నిజమా ఈ పిలుపు  యమకింకరులు అని ఆనుకుంటే ఎవరు అగుపించరు, ఎవరు నాయన నువ్వు నాకు అగుపించు మాటలే  వినిపిస్తునాయి అని అనగానే ఒక ఇరవైఏళ్ళడ్ల పిల్లగాడు నా ఎదురుగా కూర్చున్నట్లు ఒక నీడలా(Soul) ఉంది. ఎవరయ్యా నువ్వు అని నేను అనగా అప్పుడు ఆ రూపము నుండి ఈ బండ నాది ఇక్కడ అన్నీ హక్కులు నావే నా అనుమతి లేకుండా ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అంటుంది ఆ రూపం. అయ్యా ఇక్కడికి రాగానే నా కాళ్ళు ఒళ్ళు అలసి ఈ చీకట్లో ఆ ఊర్లోకి వెళ్లలేక ఇక్కడ ఒరిగానయ్య అన్నాను, ఇంతలో ఆరూపం ఈ శ్మశానంలో నిద్రఏంటి రా తాత నీ పిచ్చి కాకపోతే ఆని ఆంటే, బాబు నేను ఈ శ్మశానానికి రావటానికి నాకు ఎక్కువగా టైమ్ లేదులే నా లాంటి ఓ బిక్షగాడికి నా అంటు ఎవరు లేనోన్ని నాకు ఊరు అయితే ఏంటీ శ్మశానం అయితే ఏంటీ అని అన్నాను, అంతలో నా మాటలకు ఆ బాబు నీకు భయము జంకు లేవా అని అ రూపం ఆంటే భయమెందుకు ఈ ముసలి తనానికి అసలు నీవు ఎవరు ఈ రాత్రి నీకు ఇక్కడకు  ఎందుకు వచ్చావు,  పైగా శ్మశానం అంటున్నావు నీకు లేదా భయం ఈ రాత్రి ఇక్కడకి రావడానికి, అనగా  ఆరూపం ఈ శ్మశానమే నా ఇల్లు ఇక్కడ గత ఆరునెలలుగా ఈ బండే నా పడక అని అంటే, ఏమిటి నీకు ఇల్లు ఇడుపు లేదా నువ్వు నా లాంటి వాడివేనా  సరే  ఇక ఇద్దరం అనాధలమ్  కలిసిసాము  నాకు నువ్వు మనవడివి, నేను నీకు తాతను సరేన అని అన్నాను అంతలో ఆ రూపం అదృశ్యం అయింది ఏరా మనవడా ఎక్కడ బాబు అనగానే ఓరి ముసలి తాత నీకు అర్ధం కాదేరా నేను చచ్చి 6 నెలలు అవుతుంది.  నేను దయ్యాన్ని(Devil) దానికి నేను ఆశర్యపోయాను, సరే అగుపించు అని అనగా ఆరూపం(Soul) మళ్ళి అక్కడే కూర్చుంది నేనే ఉండి ఏమైంది నాయనా  ఎందుకు నీకు  ఈ గతి, ఆయినా ఎందుకు ఈ దెయ్యంగా, ఎందుకు యమదూతలు రాలేదా అంటే వస్తున్నారు,  ఇప్పుడు కూడా వచ్చారు నిన్ను తీసుకొని పోవడానికి ఆంతలో వాళ్ళని నేనే ఆపినాను, ఎందుకు అని నేను అడగగా  నీతో నాకు పనివున్నది, నాతో నీకు ఏమి పని నా చావు నన్ను చావనీయ్య వద్ధా, నువ్వు ఎందుకు అపావు ఇంక్క ఎన్ని రోజులు ఈ ముసలి శరీరాన్ని మోస్తూ అడుక్కుతినుకుంటూ ఊర్లు పట్టుకొని తిరగాలి అని అనగా. ఆ ఆత్మ సరే  ఒక్క రెండు రోజులు అగు నువ్వు నేను ఇద్దరము వెళదాము, ఎందుకు అని అనగా, ఎందుకంటే ఇంక రెండు రోజుల్లో చచ్చి పోతావు ఇక్కడ ఈ రోడ్డు మీద. అదేంటి యమదూతలను పంపించి రోడ్డు మీద చావు| ఇక్కడ ప్రశాంతంగా శ్మశానంలో బండపైన పడుకొని చచ్చేవాడిని ఆపి ఆ రోడ్డుమీద చావు అంట్టున్నావు, ఆ తాత ఎట్లాగో చస్తావు కానీ మనతో పాటు ఇంక్క  ఇద్దరినీ తీసుకొని పోదాము, దానికి ఏమిటి నాకు ఈ పాపం అంటే అది ఏ పాపము కాదు నీవు చేసేది ఆదేవుడే నీతో ఈ పని చేయి స్తున్నాడు ఇది కర్మ సిద్దాంతం. నీవు ఈ వూరికి వచ్చిన పని అదే, నేను సరే గాని ఆ ఇద్దరు ఎవరు అయ్యా, అసలు నీవు ఎవరు, ఇక్కడ ఈ ఆత్మగా  ఉండటానికి గల కారణమేమిటి  అనగా.తాత నా కధ చెపుతాను విను నాది  ఈ ఊరే ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను.

telugu,katha,rachana


నా తండ్రి ఈ ఊర్లో ఒక వడ్రంగి(Carpenter) ప్రతి ఇంట్లో ఏ వడ్రంగి (Carpenter) పని వున్నా నా తండ్రియే వెళ్ళి చేసివస్తుంటాడు, ఊర్లో ఉన్న ప్రతి తలుపు గుమ్మము నా తండ్రి లేదా మా తాత చేసినవే, చాలా  నిష్టపరుడు మాట అంటే ఆ మాట గురించి ప్రాణం ఇచ్చేవాడు అంత నిబద్దత గల వ్యక్తి. అమ్మ చాలా సౌమ్యురాలు ఉన్నదాంట్లో సర్దుకొని ఇంటి గుట్టుని ఏ మాత్రం బయటి వారికి తెలియకుంట సంసారాన్ని సర్దుకు పోతుంది, ఇలాంటి ఉత్తమ దంపతుల ఏకైక కుమారున్నీ నేను, మా తాతకు నాన్న ఒక్కడే నాన్న వాళ్ళ  తాతకు ఒక్కడే కొడుకు మా వంశంలో ఒక్క సంతనమే ఉన్నట్లు ఉన్నది. నాన్న నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచినారు నా తండ్రి ఒకే ఒక్క కోరిక నేను చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ఆ కోరికనే ప్రతి రోజు నాకు గుర్తుచేస్తుoడేవారు, అదే నాన్న నాతో బిడ్డా  నువ్వు మన జీవితాల్లో కొత్త మార్పుని తీసుకొని రావాలి, అని అనే వారు, ఆ మార్పు ఏమిటి నాన్న అని అడిగితే తను మాత్రం జీవితంలో మార్పు రావాలంటే నీవు ఉన్నతంగా  చదువు కోవాలి , దానికి ఈ వృత్తి  నుండి, ఉద్యోగమనే వృత్తి  లోనికి నీవు మారాలి ఇప్పుడు ఈ పనులు అన్నీ యాంత్రీకరణకు మార్పు చెందుతున్నది, కాబట్టి నీ భవిష్యత్ ఈ వృత్తితో ముడిపడవద్దు అని నా ఉద్దేశం  మన వృత్తిని అగౌరవ పర్చమని కాదు, దీనితోనే నీ  భవిష్యత్ ఒక కొత్తమార్పు రావాలి, ఎందుకంటే ఈ రోజు మనం మూడు పూటల తిని, నిన్ను చదివిస్తున్నది ఈ వృత్తే, కాక పోతే భవిష్యత్ లో ఈ వృత్తి లో జీవనం కష్టం కావొచ్చు కాబట్టి నీవు నీ ఆలోచనలను చదువు పై ఉంచి  ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని చేసి నీ తలరాతని నీవే మార్చుకో, దానికి గల ఆయుధం  ఒక్క చదువు అని చెప్పేవాడు, దానిని నేను తూచతప్పకుండా పాటిస్తూ, ఈ ఊరి నుండి 100.కి.మీ. దూరంలో ఉన్న పట్టణంలో  చదువుచున్నాను అప్పడికే ఊర్లో ఎవ్వరి పిల్లలు కూడా  10 వ.తరగతి పూర్తి చేయలేక పోయారు, నేను చదివే ప్రతి అక్షరం నాన్న మాటల ప్రభావంతో చదివి 10.వ. తరగతి మంచి మార్కులతో అంటే జిల్లా(District) మొదటి స్థానంలో ఉత్తీర్ణున్ని అయ్యాను దానికి అమ్మ చాలా సంతోషించింది ఊర్లో అందరి ప్రశంసలు, దానికి తోడు పత్రికల్లో నాపేరు ఫోటో రావడం నా జీవితంలో ఒక తొలిమెట్టు, దానికి నాన్న సంతోషం నాన్న ఈ గెలుపును తొలి కష్టంగా భావించి ఇక నుండి చదువుని శ్రద్దగా కొన సాగిస్తూనే నీ ప్రయాణం లో ఎక్కడ తప్పటి అడుగు వేయకుండా జాగ్రత్తపడు, ఇక నుండి నీపైన అసూయ, ఈర్ష్య  అనే శక్తులు నీపై కక్ష్యని ఓటమికి ప్రయత్నిస్తాయి అని చెప్పాడు. అప్పడికి మాఊర్లో ఉన్న ఉన్నత శ్రేణి భూస్వాముల(Landlords) పిల్లలు ఎవ్వరు ఈ గెలుపుని జీర్ణంచుకోలేక పోయారు, దానికి కారణం వారి పిల్లలు ఎవ్వరు కూడా 10.వ.తరగతి ఉత్తీర్ణత సాధిoచలేక పోవడం ఒక కారణం వారి పలుకుబడి, డబ్బు కూడా ఉండి ఉన్నత వర్గం అయి ఉండి కూడా ఒక్క వడ్రంగి(Carpenter) కొడుకు సాధించడం, అది జిల్లా(District) స్థాయిలో అనే సరికి వారి నుండి ద్వేషం మా కుటుంబం పై మాకు తెలియకుండానే పడుతూ వస్తుంది. వాళ్ళు అంతా  వడ్రంగి పనులకు పక్కన ఉన్న పట్టణం నుండి పని వారిని తీసుకొచ్చి వారి పనులు చేయించడం మొదలు పెట్టారు. ఈ రకంగా జరుగుచుండగానే  నేను 12.వ. తరగతి ఉన్నత శ్రేణిలో(Grade) అనగా రాష్ట్రస్థాయిలో మొదటి 10.వ. స్థానంలో వచ్చాను, దానికి  ప్రతిఫలంగా ఒక పెద్ద డిగ్రీ(Degree) కాలేజీలో అడ్మిషన్ దొరకడం దానికి తోడుగా కొన్ని సంస్థలనుండి ఆర్దిక సహాయంతో నా డిగ్రీకి మరియు భోజన వసతి సౌకర్యాలకు పూర్తిగా నా డిగ్రీ పూర్తి అయ్యే వరకు ఆదరణ అందింది. ఈ నా ఉత్తీర్ణతను ఊర్లో ఉన్నత వర్గం వారు వారి పిల్లలు అంతా  ఏకమై మా కుటుంబాన్ని అర్ద్దిక ఇబ్బందులకు గురిచేయడం మొదలైంది, ఆ విషయాలు ఏవి నా వరకు నాన్న అమ్మ ఎప్పుడు చెప్పేవారు కాధు. నాన్న ఎప్పుడు నాకు చాల ఉన్నతమైన మానసిక ఎదుగుదలను కలిగించేవాడు, ఎంత ఉత్తీర్ణత వచ్చిన నీ గమ్యస్థానాన్ని మరిచిపోకూ అని చెప్పేవాడు తను నాతో మాట్లాడే ప్రతి మాటను నా భవిష్యత్ పునాది రాళ్లుగా పేర్చుకుంటూ నా చదువును కొనసాగించాను. ఈ రకoగా నా డిగ్రీ చివరి సం. లో కలెక్టర్(Civils) పరీక్షలలో మొదటి పరీక్ష పాస్ అయ్యాను, డిగ్రీ అయిపోయాక  వేసవి సెలవుల్లో కలెక్టర్(Civils) మిగితా పరీక్షలు రాశాను ఈ వేసవి సెలవులలో పట్టణంలోనే ఉండి చదువు కొనసాగిస్తున్నాను. నేను ఊరు వెళ్ళక 3.సం. అయింది. ఆ వేసవి సెలవుల్లో పరీక్షల ఫలితాల గూర్చి నిరీక్షిస్తున్నా కలెక్టర్ ఇంటర్య్వూకు చదువు కొనసాగిస్తున్నాను. ఆ వేసవి సెలవుల్లో ప్రతి రోజు ఆ పట్టణంలో సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళేవాడిని, ఒక రోజు నేను లైబ్రరీలో చదువుకొనుచుండగా నా ఎదురు కుర్చీలో ఒక అందమైన అమ్మాయి వచ్చి కూర్చొని బుక్ తీసుకొని చదువుకొంటుంది. చాల అందంగా ఉన్నది నన్ను చూసి చూడనట్లు బుక్ లో నండి కొంచెం  ఓరగా చూస్తున్నది, తను నన్ను గమనిస్తుంది, అని నేను చూపులు బుక్ లోకి మార్చాను, అంతలో నాకు నాన్న మాటలు గుర్తుకువచ్చి తిరిగి నా చదువులో మునిగిపోయాను, ఈ రకంగా ప్రతి రోజు లైబ్రరికి రావడం నా ఎదురుగా ఆ అమ్మాయి కూర్చోవడం జరుగుతుంది ఒక వారం తర్వాత తానే నాతో పరిచయం చేసుకొని మాట్లాడటం మొదలు పెట్టింది, ఆ అమ్మాయి అందానికి ఆ మత్తుగొలిపే మాటలకు మనస్సు  నాకు తెలియకుండానే ఆ రూపాన్ని వర్ణిoచడం మొదలయింది, చంద్ర బింబంలాంటి మోముతో చక్కటి మాటతీరు, ఎప్పుడు ముఖంపై చిరునవ్వుతో ఎంతో  మాయచేసింది, తనేవచ్చి పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఉంటే, నా జీవన గమ్యాన్ని మరచి తనతో స్నేహాన్ని కొనసాగించే క్రమంలో నా మనస్సు, ఈ ప్రయాణంలో ఈ స్నేహం తగదు అని హెచ్చరించింది, కానీ నా మనస్సుపైన నా వయస్సు కోరిక జయించి ఆ అందమనే ఆకర్షణకు లోనై రోజు కొంత సమయాన్ని ఆ అమ్మాయితో గడపటం కొనసాగుతుంది. అంతలో నా జీవన గమ్యము ఆ అమ్మాయి తెలుసుకొని నీవు  నీ జీవిత గమ్యం తప్పక విజయం సాధిస్తావు అని నాకు కొంత మానసిక ధైర్యాన్ని ఇస్తుంటే నేను తన సహగమనాన్ని కాదనలేక పోయాను, సరే తను నా మంచిని కోరుకుంటుంది అని తనకు నా ప్రయాణంలో స్థానం కల్పించాను, ఆ ప్రయాణంలో కూడా నా గమ్యాన్ని మరిచిపోలేదు, నేను డిగ్రీ లో యునివర్సిటి లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ విజయంతో నా  మనస్సుకు చాలా మనో దైర్యాన్ని ఇచ్చింది. ఈ  విషయంతో అమ్మ నాన్న చాలా సంతోషించారు, ఒక్క నెలరోజుల్లో సివిల్స్ ఇంటెర్య్వూ(Interview)  ఉన్నది వాటికి చాలా జాగ్రత్తగా చదువుచున్నాను అదే సమయంలో తను నాతో కలుస్తూనే ఉన్నది, ఈ ప్రయాణంలో నాకు తనతో కొంచెం  ఎక్కువగానే చనువు పెరిగింది. ఇంటెర్య్వూ కు  హాజరయ్యాను నా వరకు . ఇంటెర్య్వూ చాలాబాగా చేశాను ఇంక నెలరోజుల్లో సివిల్స్ ఫలితాలు వచ్చేస్తాయి ఇంతలో కొంత తీరిక దొరికింది, ఆ అమ్మాయి నన్ను కలవడానికి లైబ్రరికి వచ్చింది తనతో చెప్పాను నేను గత 3.సం. ఊరువెళ్లలేదు. ఒక సారి ఊరు వెల్లివస్తాను అని తనతో చెప్పినాను, తను ఉండి  మళ్ళి  ఎప్పుడు తిరుగుప్రయాణం అంటే ఒక వారం రోజుల్లో తిరిగి వస్తాను మళ్ళీ   వచ్చి చదవటం మొదలు పెట్టాలి అని తనతో చెప్పి ఊరు వెళ్ళాను.

soul, food,collective, soul,it, is, well, with, my, soul


        ఊర్లోకి వెళ్ళగానే నాన్న మొహంలో చాలా సంతోషంగా ఉంది అమ్మ ఆనందానికి హద్దులులేవు నన్ను చూడటానికి అప్పుడపుడు పట్టణo  అమ్మ నాన్న వచ్చేవారు కానీ నేను రాలేదు. అమ్మ నాతో మీ నాన్న కోరిక నీ జీవితంలో ఒక గొప్ప వ్వక్తిగా గుర్తింపు చాలా దగ్గరలో ఉంది, నా తండ్రి అని హత్తుకొని ఆనంద అశ్రువులని కార్చి నా భుజాన్ని తన ఆనంద  భాష్పాలతో తడిసి ముద్దయింది నా మనస్సు అప్పుడు అర్దమైంది ఆ హృదయంలో నా పైన ఎంత ప్రేమ ఉంది అని, వాళ్ళు పడిన ప్రతి బాధను నాకు ఆ అశ్రునయనాల తడితోనే నా భాద్యతని గుర్తు చేసాయి, నాన్న  బహుశా  ఈ 3.సం. లో మొదటి సారి గట్టిగా కౌగిలించికొని నువ్వు చాలా గొప్పోడివిరా, నీ తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను, నేను చెప్పేప్రతిమాటని నీ గమ్యానికి వారధిగా వాడావు చాలా సంతోషంగా ఉంది నాన, నా మాటల ప్రబావం ఇoత గొప్పగా ఈ జిల్లా(District) గర్వించే అంత గొప్పగా ఎదుగుతావు అని ఊహించలేదురా|  అని చెపుతూ తన కళ్ళల్లో నుండి అశ్రువులు కార్చేస్తున్నాడు. అప్పుడు నాకు అర్దమైంది తను ఆత్మాభిమానం ఊర్లో కొoతవరకు దెబ్బతిన్నది అని. అది నా సివిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత చూద్దాము.             ఆ గౌరవం తిరిగి తీసుకరావలసిన బాధ్యత నాపైఉంది అనుకొని అక్కడితో వదిలేసాను, అంతలో నాన్న మిత్రులు నన్ను కలవడానికి ఇంటికి వచ్చారు, నువ్వు గొప్పోడివి అవుతున్నావు అని కొందరు, మీ కలెక్టర్(Collector) ఆఫీసుకు వస్తే మమ్మల్ని గుర్తుంచుకో అని కొందరు, కాబోయే కలెక్టర్ అని కొందరు, లేదు వీడు మంచి అందగాడు మంచి ఎత్తు పొడవు ఉన్నవాడు ఇతను పెద్ద పోలీస్ అవుతాడు, అని అంటుండగానే అంతలో కొందరి నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి ఊర్లో ఉన్న ఉన్నత వర్గానికి నా ఎదుగుదల చాలా అసూయగా ఉంది అని దానితో నాన్నను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని హేళనచేస్తున్నారు అని, కానీ నాకు అనిపించిoది దానికి అంతటికి  సమాధానం నేనే  చెప్పాలి అంటే ఒక మంచి ఉద్యోగం వచ్చినాకే ఊరికి తిరిగిరావాలి అని అనుకొని ఇంటి బైట అరుగు పైన కూర్చున్నాను చాలా మంది దారిలో వెళ్ళేవాళ్లు మాట్లాడిస్తునారు అంతలో నా స్కూల్ మిత్రుడు రాము వచ్చి ఏరా ఎప్పుడు వచ్చావు అని అడిగి నాకు చాలా సంతోషంగా ఉందిరా  నా మిత్రుడు కలెక్టర్ అవుతున్నందుకు అని సంతోషంతో కౌగిలించుకొని ప్రక్కనే కూర్చుని, అరే  ఊర్లో చాలా మంది నిన్ను చూసి గర్వంగా ఉంది అంటున్నారు, కానీ కొందరు మాత్రం నీ ఎదుగుదలను తట్టుకోలేక అసూయగా ఉన్నారు వారితో జాగ్రత్తరా వారికి ఆర్దిక బలం, అంగబలం అటు రాజకీయoగా కూడా పలుకుబడి ఉన్న వారు, వారిని ఓ కంట కనిపెడుతూ ఉండరా అని జాగ్రత్తలు తెలిపాడు. అప్పుడు అనిపించిoది మంచి ఈ ప్రపంచoలో(World) బ్రతకడానికి మంచి కుడా చెడుతో పోరాటం చేయాలా అనిపించింది.

        మరుసటి రోజు తిరుగు ప్రయాణం అయి పట్టణoకు వెళ్లడానికి తయారయ్యాను అప్పుడు నాన్న ఉండి ఏరా నాన్న అప్పుడే వెళ్ళాల  అని అంటే అవును నాన్న మళ్ళీ చదవడం  మొదలు పెట్టాలి. ఒక వేళ ఏమాత్రం ఈ ఇంటర్య్వూలో తప్పిన ఈ చదువు మళ్ళీ మొదటి నుండి పరీక్షలు వ్రాయాలి, మరో   సారి ప్రయత్నము చేయాలి అని చెప్పి పట్టణం బయలుదేరాను ఆదేరోజు హాస్టల్ కు వెళ్ళి సాయంత్రం లైబ్రరీకి వెళ్ళాను ఇంక రెండు వారాల్లో సివిల్స్ ఫలితాలు వస్తాయి, అనే ఆలోచనల్లో ఉండగా అప్పుడే నా పక్క సీట్లో అమ్మాయి వచ్చి కూర్చుంది ఏమ్ కలక్టర్ గారు ఎప్పుడు వచ్చారు, అని లోగొంతుతో నాభుజo తట్టి కూర్చుంది. నేను ఉండి మధ్యాహ్నo  వచ్చాను అని చెప్పగా ఏమిటి ఆ విచారo, ఎందుకు ఆ  మొహంలో ఏదో దిగులు అంది. అప్పుడు నామనస్సు ఏమి బాగాలేదు అని చెప్పగా, తను ఉండి సరే సర్ నేను ఒక ప్రదేశంకు తెసుకెళ్లుతాను వస్తారా మీకు కొంచెం  ప్రశాంతంగా ఉంటుంది. అని అనగా నేను తనతో సరే అని, బస్ స్టాప్ కు వెళ్ళి తను నేను ఒక బస్సులో కూర్చున్నాము ఆ బస్సు ఈ పట్టణం నుండి 10.కి.మీ. ధురంలో ఉన్న ఒక గుడికి వెళ్లే  బస్సు అందులో కూర్చున్నాము బస్సులో జనాలు అలజడి కూడా అంతగా లేదు. అది సమయం సాయంత్రం 6.గం. కావొస్తుంది ఒక గంటలో ఆ గుడికి చేరింది ఇద్దరము బస్సు దిగి ఆ గుడికి వెళ్ళాము అది శివాలయం గుడి. గుడి ముందు కొన్ని పువ్వులు పళ్ళు కొనుక్కోని కాళ్లూ చేతులు కడుక్కోని దర్శనం చేసుకొని బయటికి వచ్చే వరకు రాత్రి 8.గం. సమయం అయింది. ఆ ఊరి నుండి తిరుగు ప్రయాణానికి ఏ ప్రయాణ సౌకర్యం లేదు దానితో రోడ్ పైన మాట్లాడుకుంటూ చల్లా గాలికి నడుద్దాం అని తను అనగా, సరే అని ప్రక్కన ఉన్న ఒక హోటల్లో కాస్త టిఫిన్ తిని టీ  తాగి, ఇక్కడి నుండి పట్టణానికి వెళ్ళడం ఎలా అని ఆ హోటల్ లో అడగగా  వారు సార్ ఇక్కడి నుండి ఉదయం వరకు ఏ బస్సు కానీ వేరే ఏవి వెళ్లవు 1.కి.మీ. నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడి నుండి కొన్ని బస్సులు పట్టణం వెళతాయి అని చెప్పగా మెల్లగా ఆ చల్లగాలికి ఇద్దరం నడుచుకుంటూ బయలు దేరాము.  ఒక పది నిమిషాల్లో చీకటిలో  తను ఏదో మాట్లాడుతుంది అంతలో వెనుక నుండి ఆ చీకట్లో వెలుతురు వస్తుంది, అది బహుశా  ఏదైనా కారు లేదా వ్యాన్ అయి ఉంటుంది అని అనుకొంటుండగానే  తను ఉండి సరే నిల్చుందాము వచ్చే ఏదైనా  నేను ఆపుతాను అని అంటే. సరే ఒక అమ్మాయిని చీకట్లో నడిపించడం నాకు భావ్యం అనిపించలేదు , ఆ వ్యాను మా దగ్గరికి వస్తుంటే తను చేయి అడ్డoగా ఊపింది అంతలో ఆ చీకట్లో ఆ వ్యాను తెలిసినవాళ్లు ఆపినట్లు మా ముందే కీస్ మనే శబ్దం చేస్తూ ఆగింది, డ్రైవర్ తో అన్నా  మేము పట్టణం వెళ్ళాలి అమ్మాయికూడా ఉంది అని  అడగగా  ఆ డ్రైవర్ నీవు వెనకాల కూర్చో అమ్మాయి ముందు కూర్చుంటుంది అని డ్రైవర్ ముందు డోర్ తీసిండు ఆ అమ్మాయి తనకు తెలిసినవారి లాగానే ముందుకూర్చుంది నేను వెనకాల కూర్చున్నాను ఒక నలుగురు ఉన్నారు, ఆ చీకట్లో వారి మొహాలు  మసకగా ఉన్నవి  వ్యాను ఆ చీకట్లో త్రాచుపాములా  వెల్లుతుంది, అంతలో నా వెనుక నుండి ఒక్కతను ఏదో తాడు తీసి నా గొంతుకు వేసి గట్టిగా గుంజేస్తున్నాడు, ఏయ్ ఏమిటి అని అంటుoడగానే అసలు ఏమి జరుగుతుందో నాకు ఏమి అర్దం కావడం లేదూ, ఏయ్  ఏమిటి ఎందుకు నా గొంతు కు తాడు వేసినారు అని అంటుండగానే వ్యాన్ అపి ఆ డ్రైవర్ లైటు వేశాడు ముందు ఉన్న అమ్మాయి కూడా వెనక్కి తిరిగి నాకాళ్లు గట్టిగా పట్టుకుంది. అందులో ఉన్నవారు అందరూ మా ఊరి ఉన్నత వర్గానికి చెందినవారు. ఏమిటి మీరు నన్ను ఏమిచేస్తున్నారు అనగా మా ఊరి గ్రామ పెద్ద గొంతుతో  తను వెనుకనుండి ఏరా మా ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన నీవు మాముందు కలెక్టర్ అవుతావా, ఎంత తల పొగరురా  నీకు అని నా తలపై కొడుతున్నాడు, ఆ అమ్మాయి ఏంటి  బాపు(Dad) ఇంక ఎంత సేపు తొందరగా వాన్ని చంపేయ్  అని అనే సరికి ఏమిటి తను ఈ గ్రామ పెద్ద కూతురా|  నాకు తెలియదు ఎప్పుడు ఊర్లో చూడలేదు తనను, నేను తనతో ఏమిటి ఈ నయవంచన అని అనగా, తను ఏరా కుక్క నీవు ఏంటీ నీ  జాతి ఏంటీ మా బాపు  ముందు కుక్కలా  ఉండాల్సిన మీ నాన్న మా బాపు తో నా కొడుకు కాబోయే కల్లెక్టర్ అంటాడా ఎంత ధైర్యoరా మీకు మీ దిగువజాతికి. మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే ఇంజనేరింగ్(Engineering) చేస్తున్నాను నాకు రావాల్సిన పేరు గౌరవం నీకు ఎలా రా నాకు దక్కాల్సిన ఆ విలువ నీకు దక్కితే నేను ఎలా భరించాలిరా  ఆ ఊర్లో ఎలారా నేను  ఇది తట్టుకునేది . నీ ప్రతి గెలుపుతో నేను మా ఉన్నత వర్గం ఎంత రగిలి పోయామో, ఎంత బాధ  అనుభవించామో, బాపు ఈ వెధవతో మాటలేoటి బాపు 1.సం. గా వీడి  పక్కనే ఉండి ఎంత బాధ పడ్డానో ఎంత అమాయకంగా నటించానో ఆ బాధ  ఈ రోజుతో పోవాలి, అని తను అంటుంటే ఆ క్షణంలో నా ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి అని పిస్తుంది నాగొంతు గట్టిగా తాడుతో పట్టడం వల్ల నా శ్వాస ఆడటంలేదు అంతలో ఆ అమ్మాయే నా ముక్కు గట్టిగా మూసింది ఆ క్షణం వరకు నాకు తెలియలేదు నా ప్రక్కనే నాతోనే నా మృత్యువు  కొద్ది  రోజులుగా ఉంటుంది అని, ఆ క్షణం నా శ్వాస ఆడటం లేదు అంతలో నా శ్వాస పూర్తిగా ఆగిపోయింది నా ఆత్మ(Soul) గాలిలో తేలుతుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అగుపిస్తునారు, నా  ఆత్మ వెళ్ళి నా శరీరాన్ని తడుతుంది ఏ మాత్రం కదలడం లేదు నా శరీరం వేడి తగ్గింది,  అని నా రాక్షస ప్రేయసి చల్లగా అయింది అని నా డెత్ సర్టిపికెట్ తను ఇచ్చింది. అంతలో ఆ చీకట్లో ఆ వ్యాన్ బయలు దేరింది. నా శరీరంతో పాటు నా ఆత్మ ఆ వ్యానులోనే ఉంది ఆ రాక్షసి తండ్రి ఎవరి వల్ల కానీ పని నీ వళ్ల  అయింది తల్లి నేను చేయలేని పని నువ్వు వీడిని మట్టి లో కలిపావు, ఎవ్వరికీ అనుమానం రాకుండా మన పని కానిచ్చావు అని కూతుర్ని పొగిడేస్తున్నాడు, అవును బాపు వీడి గురించి  1.సం. నుండి ప్లాన్ వేసి ఈ రోజు నా చేతులతోనే వీడి పీడవిరగడయిoది అని అంటుంది. నా శరీరాన్ని తీసుకెళ్లి మా కాలేజీ దగ్గరలో ఉన్న రైలు పట్టాల పై పడేసి  వెళ్ళిపోయారు అప్పుడే ఒక రైలు రావడం నా మెడ కట్ అయి పక్కకు పడి పోయింది. ఇంట్లో నా తల్లిదండ్రులు నా శవాన్ని  చూసి వారి బాధను వర్ణించడం నా వల్ల కాదు, ఈ రోజు వరకు మా అమ్మ నాన్న మానసికంగా కోలుకోలేదు అసలు ఎలా జరిగింది అనేది అందరికీ ఒక ప్రశ్న లాగానే నా చావు మిగిలిపోయింది.

chic, soul,soulstone,pokemon,soul, silver, well, with,soullyrics,chicken, soup


        కొందరు తనకు కలెక్టర్ జాబ్  రాదు అని ఆత్మ హత్య అని, మరి కొందరు ఎవరో పట్టణంలో చంపారు అని పుకార్లు పుట్టాయి, కానీ మా నాన్న మాత్రం వాడు అంత పిరికివాడు కాడు కానీ ఏదో జరగడం కాదూ, ఈ ఉన్నత వర్గం నా కొడుకు చావుకు కారణం అని మా అమ్మతో అంటుండగా విన్నాను. ఒక రోజు మా గ్రామ పెద్ద మా  నాన్న ను తన ఇంటికి పిలిచి ఏరా నీవు  వడ్రంగివి నీ కొడుకును ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకోమని చెప్పక,  వాడు  కలెక్టర్ అవుతాడా వాన్ని  అన్నీ ఆపమను లేక పోతే తరువాత నీ ఇష్టం, అని బెదిరించిన విషయం నా చావు తర్వాత అమ్మతో చెపుతుంటే అది నా ఆత్మ(Soul) విన్నది. ఆరోజు నుండి ఈ బండరాయి నా ఇల్లు ఆయింది. అది నా కథ అని తన ఆత్మ వ్యధని నాతో చెప్పాడు. ఆ బాబు కథ విన్నతర్వాత ముసలి వాడనైనా నాకే వారిపైన కోపం వస్తుంది బాబు నీకు చాలా అన్యాయం జరిగింది కానీ దానికి నీవు ఇక్కడ ఉండి పరిస్కారం ఏమిటి. అప్పుడు ఆ బాబు తాత ఆ రోజు నుండి ఆ వ్యాను లో వచ్చిన వారిని ఒక్కోక్కరిగా  ఎవరో ఒక్కరి సహాయంతో అందరినీ చంపాను, ఆ తండ్రి కూతుర్లను తప్ప, వారి చావుకు నీ  సహాయం కావాలి, సరే ఎలాగో చావడానికి  నేను సిద్దంగా ఉన్నవాన్ని  నా ఈ ముసలి శరీరం తో నీకు ఏ విదంగా ఉపయోగం అంటే, ఆ బాబు తాత ఈ చచ్చినవాళ్లు అందరూ ఆ రోజు వ్యాను లో వచ్చినవారే వారి  చావులతో మా ఊరి పెద్ద తనకూతుర్ని రేపు ఈ ఊరికి తీసుకొస్తున్నాడు, వాళ్ళిద్దర్ని ఒకే క్షణంలో ఇక్కడ చంపాలి. బాబు అసలు నీ ఆత్మ(Soul) నాకు ఎoదుకు అగుపిస్తుంది, అనగా తాత నీకు ఈ రోజు చివరి రోజు నీ గూర్చి దేవదూతలు వచ్చి నీ ప్రాణం తీస్తుంటే నేను వారిని  బ్రతిమాలి ఈ ఒక్క రోజు నీ శరీరాన్ని నాకు ఇవ్వండి అని ఆ దేవదూతలను వేడుకోగా  నా కథ తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక్కరోజు ఈ  శరీరం నీది అని చెప్పి వెళ్ళిపోయారు. నీవు మహాపుణ్యాత్ముడవు రేపు నీకు నాకు ఈ భూమి పై విముక్తి నీ ప్రాణానికి ఈ ఒక్కరోజు నేనే యజమానిని నీవు చాలా ఉత్తముడవు, తాత నీ గురించి నేను ఆ దేవదూతలను అడిగాను స్వామి ఏమిటి ఈ ఆరు నెలలు నుండి ఎందరో చనిపోతే యమదూతలు వచ్చారు వాళ్ళను నేను అడిగాను  నన్ను తీసుక వెళ్లరా, దానికి వస్తాం ఆరోజు దేవదూతలు కూడా వస్తారు నీతో ఒక గొప్ప వ్యక్తి వస్తాడు అతనితో నీ ప్రయాణం నీవు మా లోకం కాదు అని చెప్పారు.

        తాత నీవు చాలా పుణ్యాత్ముడవు దేవదూతలు చెప్పారు నీవు నీజీవితంలో ఒక్కరినికూడా ధూషిoచడం కానీ, ఈర్ష్యగాని ద్వేషం కానీ లేని వ్యక్తిగా మీరు  మిగిలారు, ఉన్న రోజు తిని లేనిరోజు ఆ దేవుణ్ణి(God) తలుచుకొని పడుకొనేవారట, నీవు పూర్వ జన్మలో ఒక యోగివట ఇదో చిన్న దోషంతో ఈ జన్మతహ ఈ రకమైన జీవితం ఇది చివరిది నీకు రేపటితో ఈ లోకంతో విముక్తి . సరే నాయన నీ ఆత్మ శాంతి కోసం నా చివరి ఘడియల్ని నీకు అర్పిస్తున్నాను అనేసరికి కోడికూత సమయం అయింది. అంతలో ఊర్లో నుండి కోడికూత వినిపిస్తుంది. కొద్దిగా వెలుతురు వస్తుంది అంతలో దగర్లో ఉన్న బావి వద్దకు వెళ్లి  స్నానం చేసాను తిరిగి ఆ బండ దగ్గరికి వచ్చాను. ఆ ఆత్మ(Soul) నాతో తాత తొందరగా ఊర్లోకి వెళ్లి నీకు దోరికింది తిని 11.గం. వరకు ఇక్కడికి రా ఆ తండ్రి కూతుర్లు ఈ రోడ్డు నుండి వస్తారు అని అన్నాడు. అంతలో నేను ఊర్లోకి వచ్చి కొన్ని  oడ్ల దగ్గర భోజనం  అడుక్కోని తీసుకొని తిరిగివెళ్లి  తృప్తిగా ఆ బండపై కూర్చొని తింటుండగా తాత అనే శబ్దం వినిపించింది చెప్పు బాబు అని అన్నాను తను ఉండి తాత తృప్తిగా తిను ఇది నీ చివరి భోజనం అని అన్నాడు, తాత ఇంక కొద్ది సేపట్లో ఆ తండ్రికుతుర్లు ఒక స్కూటర్ పై ఇటూ వస్తుంటారు నీవు ఆ స్కూటర్ ని ఈ బండ దగ్గరకు రాగానే అడ్డంగా వెళ్లు , అంతలో ఆ స్కూటర్ అదుపు తప్పి ఈ బండపై పడుతుంది ఆ తర్వాత వాళ్ల  ప్రాణాల సంగతి నాకు వదిలేయి అని అన్నాడు సరే అయ్యా అని నేను తృప్తిగా తిన్నాను అంతలో తాత తాత అనే పిలుపుతో, చెప్పు బాబు ఆ స్కూటర్ వస్తుంది రోడు అటువైపు వెళ్ళు నేను చెప్పినట్టు చెయ్యి  అన్నాడు అంతలో చేతి కర్ర తీసుకొని రోడు అటువైపు వెళ్ళాను అంతలో స్కూటర్ వచ్చింది దానికి నేను అడ్డంగా వెళ్ళాను ఆ స్కూటర్ అదుపు తప్పి నాకు తగిలిoది నేను, ఆ స్కూటర్ పై ఉన్నవాళ్ళు ఆ బండపై పడిపోయాము  అంతలో నాకు ఏo  జరుగుతోందో తెలియటంలేదు, ఆ ఆత్మ నా  శరీరంలో ప్రవేశిoచి ఆ తండ్రి కూతురుపై పడి ఇద్దరి గొంతు నులిమి చంపేసింది, అది నా చేతులతో వారి ప్రాణం అనంత వాయువులో కలిసిపోయిoది.   వారి ఆత్మలను యమధూతలు తీసికెళ్లారు.  అంతలో నా ప్రాణం ఏదో తేలికగా అయింది, నా శరీరం వదిలేసింది నా ఆత్మ శరీరం నుండి విడిపోయింది ఆ వార్త తెలిసి ఊరి  జనం అక్కడికి వచ్చారు ఆ తండ్రి కూతుర్ల చావును, పక్కకు నా శరీరాన్ని చూసి ఈ ముసలోడు పొద్దున్నే ఊర్లోకి వచ్చి అడుక్కొని వచ్చిండు పాపం ఈ ఊరి పెద్దమనిషి ఆ ముసలివాన్ని స్కూటర్ తో గుద్ది చంపారు దానితో ఆ బండమీద పడి వాళ్ళు చచ్చారు అని అనుకుంటున్నారు అంతలో పోలీసు వాళ్ళు వచ్చారు ఈ శవాలను పంచనామాకు పంపాలి అంటున్నారు అక్కడ ఆ బాబు తల్లి తండ్రి వచ్చి ఆకాశం లోకి చూస్తూ నాన్న ఇది అంతా  నీవే  చేశావురా    అని ఆకాశంలోకి చూస్తూ భార్యాభర్తలు మొక్కుతున్నారు. ఆ ఆత్మ నాతో తాత వారే నా  తల్లి తండ్రులు చూడు తాత వాళ్ళ  మొహాళ్లో   ఎంత సంతోషమో, వారి కొడుకు చావుకు కారకులైన వారు  ఏ చట్టాలకు, ఏ వ్యవస్థకు చిక్కని ఆ నీచుల చావుకు ముగింపుకు సంతోషిస్తున్నారు, ఆ ఆత్మ అంటుంది నాన్న మళ్ళీ జన్మంటు ఉంటే నీవు నా కడుపులో పుట్టు నాన్న, అని అన్నాడు అంతలో ఆ దేవదూతలు వచ్చారు మా రెండు ఆత్మలను తీసుకొని నాతో నీవు ఈ క్షణం లో చేసిన  తప్పుకు  ఒక్కసారి నరకంలో నుండి నీకు స్వర్గప్ర్రాప్తి ఈ అబ్బాయికి మాత్రం కొద్ది రోజులు నరకంలో ఉండి తర్వాత నీ  దగ్గరకు వస్తాడు అని నన్ను నరకంగుండా  స్వర్గానికి తీసుకొని వెళ్లారు.


                                                                 స్వస్తి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్వచ్చమైన ప్రేమ true love

ఓం సాయి                 అ ప్పుడు నా వయస్సు 10 సం. కాబోలు 4 వ తరగతి పూర్తి అయి వేసవి సెలవులు ఇచ్చారు ఆ సెలవులకు నా మిత్రులు కొందరు వల్ల వల్ల అమ్మమ్మ ఉర్లకకు వెళ్ళిపోయారు మరి కొందరు రోజు వారి అమ్మ నాన్నలు పొలము పనులకు వెళ్ళితే వారితో పాటు వారి బావి దగ్గరికి వెళ్ళేవారు నాకు మాత్రం ఇంట్లో అఢుకోవడం అమ్మ చెప్పిన చిన్న చిన్న పనులు చేయడంతో రోజు గడిసిపోయేది వేసవి సెలవులు కాబట్టి అప్పుడు మా ఊరికి నాటకలు ఆడేవారు వచ్చరు వారు ఊర్లో చివరకు ఉన్న మా బడి ఆవరణలో దిగినారు , మా బడి ఆఫీసుకు మరో రెండు గదులకు మాత్రమే తలుపులు ఉన్నవి మిగితా గదులకు తలుపులు లేవు , వారు ఆ తలుపులు లేని గదులల్లో దిగినారు. ఆది 1986-87 నాటి రోజులు ఆ రోజుల్లో నాటకాలు ఒక గొప్ప అనుభూతి , ఆ కాలంలో మా ఊర్లో ఒక్క గ్రామపంచాయితీ ఆఫీసులో ఉండే టి.వి ఒక గొప్ప విశేషం. అప్పుడు టి.వి లో శాంతి స్వరూప్ వార్తలు వారానికి ఒక్క సారి వచ్చే చిత్రాలహరి అప్పుడపుడువచ్చే తెలుగు సినిమాలు అది బ్లాక్ అండ్ వైట్ టి.వి లో , ఒక గొప్ప కాలక్షేపం , ఆలాంటి రోజుల్లో ఊర్లోకి నాటకాల వాళ్ళు వచ్చ...

Failure is the first step of success, it will decided your destiny - in Telugu

  Failure is the first step of success, it will decided your destiny మనిషి జీవితంలో ప్రాణం చాలా విలువైనది ఆ దేవుడు ఎచ్చే ప్రాణం, ఆదే దేవుడు తీసుకునే వరకు ఉండ్డని ఎందుకు బలవన్ మరణాలు , ఆత్మ హత్యలు నీకు ఎవ్వరు ఇచ్చారు ఆ హక్కు ? ఒక విద్యార్దిగా నీవు పరీక్షలో తప్పవేమో కానీ జీవితంలో ఓడిపోలేదు , ఒక విద్యార్దిగా చదువు ఆవసరం కానీ , ఒక మనిషిగా , ఒక ప్రాణిగా చదువు ఆవసరం లేదు. జీవన ప్రయాణంలో సులభంగా తక్కువ శ్రమతో గమ్యాన్ని చేరడానికి మాత్రమే చదువు ఉపయోగం.  ఓటమి అనేది ఒక గుణపాఠం లేదా అది నీ జీవన గమ్యాన్ని మార్చే మలుపు కావొచ్చు కానీ ,  ఆత్మర్పణ చేసుకోనెంత , శిఖరం చివరి ఆంచు కాదు. పరీక్ష తప్పవు అనుకుంటే చదువు , మళ్ళీ , మళ్ళీ చదువు ఓటమితో గెలవాలి అని చదువు , గెలిచే అవకాశం వస్తుంది.  ఒకవేళ రాక పోయిన నిరాశ చెందకు , అప్పుడు నిజాన్ని గ్రహించు నీ గమ్యాన్ని మార్చు నీ మనస్సు లోతుల్లోకి వెళ్ళు. నీవు ఉండేది ఊరు అయితే ఒంటరిగ మీ ఊరు చెరువు కట్టమీద కూర్చొని , లేదా పచ్చని పొలాల ప్రక్కన నడుస్తూ , లేదా పచ్చని చెట్ల మద్యన నడుస్తూ నీ మనస్సు లోతుల్లో వెతుకు నీకు ఇష్టమైన ...

Friendship-in Telugu

  నేస్తమా ! నేస్తమా ! ఈ సువిశాల ప్రపంచంలో   నేస్తమా ! ఈ సువిశాల ప్రపంచంలో నా మనస్సును గెలిచిన నేస్తమా ! నా మనస్సును గెలిచిన నేస్తమా !   బుడిబుడి నడకలతో మొదలైన మనస్నేహం నేస్తమా ! మనది ఈ జన్మ అనుబంధం కాదు , ఇది ఎన్నో జన్మల   సంబంధం. మన చిన్నప్పుడు మీ అమ్మ , మా అమ్మ అనుకునేవారు మనం పాలు త్రాగే వయసులో నా ఎంగిలి పాలు నీవు , నీ ఎంగిలి పాలు నేను త్రాగను అని. మనమే కాదు నేస్తమా! మనవల్ల మన తల్లులు కూడా స్నేహితులుగా మారారు. ఇది అంతా మన స్నేహబలం కాబోలు , కలిసే ఆడుకున్నాము కలిసే తిరిగాము , మనం కలిసి గడిపిన ప్రతిక్షణం ఒక మధురానుభూతి ఇస్తుంది . How to Human Relations are Depending on Money in Telugu        చెరువు గట్టుపై కూర్చొని చెరువులో తిరిగే పక్షులను చూసి ఆనందపడ్డము , ఆ పక్షులు నీటిలోనికి మునిగి చేపలను పట్టే విన్యాసాలను తిలికించాం. సాయం సమయంలో నీటిలోనుండి ఎగిరిపడే చేపలను చూసి మన మనస్సులలో కలిగే ఆ ఆనందం ఎప్పుడు మరిచిపోలేము నేస్తమా!        చెరువు తుములోనుండి వచ్చే నీటి కాలువలలో ఉండే చేప...

life journey of every man in Telugu

  ప్రతి మనిషి జీవన ప్రయాణం LIFE JOURNEY OF EVERY MAN పసితనం        వ ర్షం వెలసిన తర్వాత కాగితలని పడవలుగా చేసి కాలువల వెంటపడ్డ పసితనం మనది , కిటికీలో కూర్చొని బయట ఆడుకుంటున్న మన వయస్సు పిల్లలని చూసి కేరింతలతో చప్పట్లు కొట్టే వయస్సుమనది.        దండెమ్ మీద ఉయ్యాల ఊగుతున్న పిచ్చుకలను చూసి ఆనంద పడిన క్షణలు మనవి.        వర్షం పడుతుంటే తలమీద అమ్మకొంగు కప్పుకొని చినుకులకు చిట్టి చేతులు చాపి రోడ్డు అంత ఒకటే ఆట. వర్షం వెలిసిపోయిన తర్వాత అమ్మ తడిసిపోయి కూడా మన తల మీది నుండి కొంగు తీయకుండా భద్రంగా ఇంట్లోకి చేర్చిన క్షణలు. గొంతు అలలమీద ఘంటసాల పాటలు , అలా సంగీత సముద్రంలో మునకలు. బాల్యం        కాంతరావు కత్తి యుద్దాలు చూడటానికి వారాల తరబడి నిరీక్షణ.        వేసవి కాలం సెలవులు , ఆవకాయ గుబాళింపులు ,        ముంజేలు , మావిళ్ళ రుచులతో నిండిన ఋతువులు ,        సంక్రాంతి చలిమం...

Problem in Telugu

  సమస్య - Problem        స మస్య ఆనేది ఈ భూమి పైన ఉన్న ప్రతి ప్రాణికి ఉంటుంది.        ఏ జీవి అయిన తనకు వచ్చిన సమస్యను అదిగమించడానికి , ఏ ఇతర జీవులను సలహా అడుగదు. కారణం వాటికి భాషరాదు , కాని సమస్య అనేది మనిషికి వచ్చేవరకు దానికి ఈ మనిషి ఎంత కుంగిపోతాడు అంటే , ఈ ప్రపంచంలో ఏ జీవికి మరి ఏ ఇతరులకు రాని సమస్య తనకు ఒక్కరికే వచ్చినట్లు కుంగిపోతాడు. కారణం ఆ సమస్య పరిష్కరం కంటే , ఆ సమస్య వచ్చినందుకు , ఆ సమస్య తనకు కలగడానికి ఇతరులను నిందించుటకు తన జీవన విలువైన సమయాన్ని వృద చేస్తాడు. కాని తను , తన సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేసేవారు చాలా అరుదు.        ఒక సారి నేషనల్ జియోగ్రాపి ( National Geographic channel ) చానల్ లో చూస్తే , ఆడవిలో ఒకొక్క జీవి పడే కష్టలు ఎంత భయానకం అనేది తెలుస్తుంది , ఆ జీవుల జీవన పోరాటం ముందు మన జీవన పోరాటం ఏ మాత్రం సమస్యకాదు. How to Human Relations are  Depending on Money in Telugu              ఈ ప్రపంచంలో ...

My Partner my heart in Telugu

  నా హృదయచెలి My Partner my heart నీ మృదుకరాల స్పర్శ తాకితే చాలు నా చిన్ని హృదయంలో ఏదో తెలియని హాయి నీ మృదు మధుర పెదాల స్పర్శే చాలు నా తనువు అంతా స్వర్గపుటంచులను తాకడానికి   నీవే నా జీవితంలో ప్రచేశించిన వేళ నా మనో పలకంపై ఎన్నో అనన్యమైన ఆలోచనలు   నీవే నా దేహంలో ప్రవేశించిన వేళ నా జీవితమే నీకు అంకితం ప్రియా సువిశాలమైన నా హృదయసామ్రాజ్యానికి నీవే రారాణివై   నా జీవితపు ఆశాకరదీపికవై వెలుగొందే నీ చిరుమోముకు నా నమః   సుమాంజలి.     స్వస్తి చివరి వరకు చదివినందుకు దన్యవాదాలు

My heart when you are came this world - in Telugu poem

  ప్రియా నీవు భూవిపైకి వచ్చినవేళ My heart when you are came this world కమలం వికసించినది తుమ్మెద ఝుమ్మని నాదంచేసినది తూనీగ రెక్కలు విచ్చుకొని ఆకాశానికి ఎగిరింది చీలికమ్మ నీరాకకు పచ్చని తోరణం కట్టింది కోకిల రాగం పెంచింది How to Human Relations are Depending on Money in Telugu భ్రమరం మకరంధాన్ని గ్రోలింది మేఘాలు వర్షించాయి చందమామ నిరాకకు సిగ్గుపడి మేఘాలచాటుకు వెళ్ళాడు ప్రియా నీవు ఈ భూవిపైకి వచ్చినవేల | ప్రకృతి నీకు ఇచ్చిన స్వాగతం. స్వస్తి చివరి వరకు చదివినందుకు దన్యవాదాలు  

How to Inspire a Man - Abdul Story in Telugu

  అబ్దుల్ చచా ఆదర్శ జీవితం   Abdul Inspire Life ఓం సాయి అబ్దుల్ చచా , తను ఒక పేద వ్యాపారి , తను సైకిల్ పై ఒక చెక్క డబ్బా పెట్టుకొని దానికి చుట్టు ప్లాస్టిక్ కవర్ కట్టి దానిని సైకిల్ వెనుక క్యారియర్ పై గట్టిగా కట్టుకోని అందులో బన్( Bread ) పిసెస్ ను పెట్టుకొని చుట్టు ఉన్న ఊర్లలో అమ్ముకొని జీవనన్ని సాగిస్తున్న ఒక సాదారణ దిగువ మధ్య తరగతి జీవనం. తనకు గంపేడు సంసారం ముగ్గురు కూతుర్లు ఇద్దరు అబ్బయిలు , అప్పుడు అప్పుడు వచ్చే దగ్గరి బందువులు , వంశపారంపర్యంగా వచ్చే ఒక పెద్ద పెంకుటిల్లు , అందరి జీవితాలు తను అమ్మే ఆ బన్ ( Bread)   వ్యాపారం పైననే నిలబడివున్నవి.        తన జీవితంలో అనుబందం ఉన్న వాటిలో ముఖ్యమైనది తన సైకిల్ తర్వతే , తన భార్య అయిన ఇంక ఎవరైన. తన సైకిల్ ను ఎంత శుభ్రంగా ఉంచుతాడు అంటే , తన వ్యాపారం ఉదయం 5.గం. మొదలైతే 10.గం. లకు ముగుస్తుంది. ఆ తర్వత ఇంటికి వచ్చి కాస్త బోజనం చేసి ప్రతి రోజు ఒక గంట సేపు శుభ్రంగా తన సైకిల్ తుడువడంతోనే సరిపోతుంది. తర్వత సాయంత్రం 3.గం. నుండి 4.గం. మద్యన ప్రక్కనే ఉన్న ఆలేరు (Alair) టౌన్ కు వెళ్ళి అక్కడ బన్ ...

How to Human Relations are Depending on Money in Telugu

  How to Human Relations are Depending on Money   ఆ సమయం ప్రొద్దుగూటిలో పడే సమయం. ఆకాశంలో పక్షులు అన్ని తమతమ గూటికి చేరడానికి తిరుగుప్రయాణంలో వున్నవి అక్కడక్కడ చెట్లపై పక్షుల అలజడి అవుతుంది. వీధుల్లో ఆవులు గేదలు వాటి పిల్లలను చూడాలనే ఆత్రుతతో వేగంగా నడుస్తున్నవి , వ్యవసాయానికి వెళ్ళిన కూలివాళ్లు తిరుగు ప్రయాణంలో వున్నారు. అందులో కొందరు నన్ను మంధలిస్తు వెళ్ళుతున్నారు మరికొందరు ఈ ముసలిదానితో ఏమి పనిలే అన్నట్టు తలప్రక్కకు త్రిప్పుకొని వెళ్ళుచున్నారు.        నేను మాత్రం ఎవరిగురించి ఎదురు చూడటంలేదు , ఎవరు నా ఇంటికి వచ్చేవారు లేరు ఎందుకంటే నేను ఒంటరి ముసలిదాన్ని. కన్నపిల్లలలో మానవత్వం నశిస్తే నాలాంటి ఒంటరి వృద్దులసంఖ్య పెరుగుతూనే వుంటుంది . నేను పుట్టింది ఒక మగ్గం( Loom ) నేసుకునే పేద ఇంటిలో. అవి రజాకారులకు ముందు అని అనేవారు నా తండ్రి , నాకు ఇద్దరు చెల్లెలు మాది పేదకుటుంబం కాబట్టి మా ఊరికి 10.కి.మీ. దూరంలో వున్న మగ్గం ( Loom ) నేసుకునే మరో కుటంబలోకి పెళ్లి అనే కార్యక్రమంతో ప్రవేశించను.        నా భర్త మగ్గం( Loom ) న...