నేస్తమా!
నేస్తమా! ఈ సువిశాల ప్రపంచంలో
నేస్తమా! ఈ సువిశాల ప్రపంచంలో
నా మనస్సును గెలిచిన నేస్తమా!
నా మనస్సును గెలిచిన నేస్తమా!
బుడిబుడి నడకలతో మొదలైన మనస్నేహం నేస్తమా!
మనది ఈ జన్మ అనుబంధం కాదు,
ఇది ఎన్నో జన్మల సంబంధం.
మన చిన్నప్పుడు మీ అమ్మ, మా
అమ్మ అనుకునేవారు
మనం పాలు త్రాగే వయసులో నా ఎంగిలి పాలు నీవు,
నీ ఎంగిలి పాలు నేను త్రాగను అని.
మనమే కాదు నేస్తమా! మనవల్ల మన తల్లులు కూడా స్నేహితులుగా
మారారు. ఇది అంతా మన స్నేహబలం కాబోలు,
కలిసే ఆడుకున్నాము కలిసే తిరిగాము, మనం కలిసి గడిపిన ప్రతిక్షణం ఒక మధురానుభూతి ఇస్తుంది.
How to Human Relations are Depending on Money in Telugu
చెరువు
గట్టుపై కూర్చొని చెరువులో తిరిగే పక్షులను చూసి ఆనందపడ్డము, ఆ పక్షులు నీటిలోనికి మునిగి చేపలను పట్టే విన్యాసాలను తిలికించాం. సాయం
సమయంలో నీటిలోనుండి ఎగిరిపడే చేపలను చూసి మన మనస్సులలో కలిగే ఆ ఆనందం ఎప్పుడు
మరిచిపోలేము నేస్తమా!
చెరువు
తుములోనుండి వచ్చే నీటి కాలువలలో ఉండే చేపపిల్లలతో ఆడుకున్నప్పుడు, ఆ చేపపిల్లలను పట్టుకొని నీటిలో వదిలేస్తూ, ఆ
నీటిలో ఆడుకున్నపుడు అప్పుడు కలిగే ఆ గొప్ప అనుభూతి మన చిన్నారి మనస్సులకే తెలుసు
నేస్తమా!. ఇప్పుడు అనిపిస్తుంది నేస్తమా అప్పుడు ఆ చేపలను ఎందుకు వదిలామో, ఆ చిన్న చేపపిల్లలని వాటి నేస్తాలకు దూరం చేయవద్దు అని, ఆ పసిప్రాయంలోనే మనకు తెలుసు కాబోలు,
మనం అంత్యదశ వరకు స్నేహితులగా ఉందము.
ఇంటి చూరులో
పిచ్చుకలు (sparrow)
పెట్టిన గూటిలో నుండి పిచ్చుకల శబ్దాలువిని వాటి సహజీవనం చూసి మనం కలిసి ఆనందించిన
క్షణాలు ఇప్పటికీ మరవలేను నేస్తమా!
నేస్తమా! మన ఇరువురిలో ఒక్కరిదగ్గర 10.పైసలు వున్న, మనిద్దరం ఆ కోమటి బుచ్చయ్య దుకాణానికి వెళ్ళి శొంఠి పిప్పరమెంట్లు (mint chocolate) కొనుక్కునేవాళ్లం.
దానికి ఆ కోమటి బుచ్చయ్య 10.పైసలు ఇచ్చిన శొంఠి
పిప్పరమెంట్లు (mint chocolate) పోను, అదనంగా రెండు ఇచ్చేవాడు అవి ఇస్తున్నపుడు
అతని ముఖంలో కలిగే ఒక తృప్తీ నాకిప్పటికి గుర్తు నేస్తమా నాకు ఇప్పుడు
అనిపిస్తుంది అతను ఆ రెండు ఎందుకు ఎక్కువ ఇచ్చేవాడు ఆంటే అది మన స్నేహం చూసి
ముచ్చటపడి కాబోలు.
నేస్తమా!
మనం చిన్నప్పటినుండి కలిసి చదువుకున్నాము కలిసే పెరిగాము, ఇద్దరం ఉపాధ్యాయవృత్తిలోనే ఉద్యోగంలో చేరాం, ఒకే
ఊరి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాము మన వల్ల మన జీవిత భాగస్వాములు, మన పిల్లలు, మన వంశమే స్నేహితులుగా మారారు. మనం ఒక
స్నేహసామ్రాజ్యం స్థాపించము.
నేస్తమా!
మనం ఒకే ఇంట్లో పుట్టలేదు, ఒకే మతంలో పుట్టలేదు, నీవు మసీదువెళ్లినా, నేను మందిరానికి వెళ్ళినా, మన స్నేహానికి దినదినం మెరుగులు దిద్దుకుంటూనే వచ్చాము. ఈ స్నేహమానే
నందనవనాన్ని తీర్చిదిద్దుతున్న సమయంలో ఎందుకు నేస్తమా! నన్ను ఒంటరిని చేశావు.
అవునులే ఆ దేవుడికి ఏమి తెలుసు మన స్నేహం విలువ ఈ ప్రపంచంలో మన
స్నేహాన్ని చూసి ఎవరు ఈర్ష్యపడలేదు. కాని ఆదేవుడికి మన స్నేహం ఈర్ష్యగా
కనిపించిందిఏమో! అందుకే మన స్నేహన్ని విడదీసినాడు.
నేస్తమా!
నీవు ఏమి భాదపడకు అతి త్వరలోనే నేను వస్తున్నాను నీవు ఉన్నలోకంలోనే స్థాపిద్దాం మన
స్నేహ సామ్రాజ్యం.
అపటివరకు
నీవు నాతో గడిపిన మధురక్షణాలను గుర్తుచేసుకుంటూ ఆ జ్ఞాపకాలతో గడిపేస్తా
వస్తా నేస్తమా నే అతీత్వరలోనే వస్తా !
చివరి వరకు చదివినందుకు దాన్యవాదాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి