Failure is the first step of success, it will decided your destiny
మనిషి జీవితంలో ప్రాణం చాలా విలువైనది
ఆ దేవుడు ఎచ్చే ప్రాణం, ఆదే దేవుడు
తీసుకునే వరకు ఉండ్డని
ఎందుకు బలవన్ మరణాలు,
ఆత్మ హత్యలు
నీకు ఎవ్వరు ఇచ్చారు ఆ హక్కు?
ఒక విద్యార్దిగా నీవు పరీక్షలో
తప్పవేమో కానీ
జీవితంలో ఓడిపోలేదు, ఒక
విద్యార్దిగా చదువు ఆవసరం కానీ,
ఒక మనిషిగా, ఒక
ప్రాణిగా చదువు ఆవసరం లేదు.
జీవన ప్రయాణంలో సులభంగా తక్కువ శ్రమతో గమ్యాన్ని చేరడానికి మాత్రమే చదువు ఉపయోగం.
ఓటమి అనేది ఒక గుణపాఠం లేదా అది నీ జీవన గమ్యాన్ని మార్చే మలుపు కావొచ్చు కానీ, ఆత్మర్పణ చేసుకోనెంత, శిఖరం చివరి ఆంచు కాదు.
పరీక్ష తప్పవు అనుకుంటే చదువు,
మళ్ళీ, మళ్ళీ చదువు
ఓటమితో గెలవాలి అని చదువు, గెలిచే అవకాశం వస్తుంది. ఒకవేళ రాక పోయిన నిరాశ చెందకు, అప్పుడు నిజాన్ని గ్రహించు నీ గమ్యాన్ని మార్చు నీ మనస్సు లోతుల్లోకి వెళ్ళు. నీవు ఉండేది ఊరు అయితే ఒంటరిగ మీ ఊరు చెరువు కట్టమీద కూర్చొని, లేదా పచ్చని పొలాల ప్రక్కన నడుస్తూ, లేదా పచ్చని చెట్ల మద్యన నడుస్తూ నీ మనస్సు లోతుల్లో వెతుకు నీకు ఇష్టమైన ఆసక్తిగల ఆంశము దొరికినప్పుడు నీ ముఖంలో వెయ్యి లైట్ల వెలుగు వస్తుంది. నీ మనస్సు తేలిక ఆవుతుంది. ఇది అంత నీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది, నీ మనస్సు శరీరంలో జరిగే రసాయనిక మార్పే నీ గమ్యాన్ని తెలిపే మార్గం, అప్పుడు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రా.
అప్పుడు నీ జీవత గమ్యాన్ని నీ తల్లి తండ్రులకు వివరంగా
చెప్పు వాళ్ళు నిరాకరిస్తే వాళ్ళతో చర్చించు నీ భవిష్యత్ ప్రణాళిక వాళ్ళకు చెప్పు
వాళ్ళకు నీ గమ్యం పైన ఉన్న ఆసక్తిని నిజాయితీతో చెప్పు వాళ్ళు నీ మాటలలో వల్ల
తనయుడి భవిష్యత్ నిచ్చింతగా ఉంటుంది అని విశ్వాసం కలిగించేలా నీ ఆర్తన వినిపించు
నీ గమ్యాన్ని చేరుకో.
“ ఓటమి
ఆనేది జీవితంలో చివరి రోజు కాదు,
అది జీవన గమ్యాన్ని మార్చే ఒక గొప్ప రోజు “
స్వస్తి
చివరి
వరకు చదివినందుకు దన్యవాదాలు
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి