సమస్య- Problem
సమస్య
ఆనేది ఈ భూమి పైన ఉన్న ప్రతి ప్రాణికి ఉంటుంది.
ఏ జీవి అయిన తనకు వచ్చిన సమస్యను అదిగమించడానికి, ఏ ఇతర జీవులను సలహా అడుగదు. కారణం వాటికి భాషరాదు, కాని
సమస్య అనేది మనిషికి వచ్చేవరకు దానికి ఈ మనిషి ఎంత కుంగిపోతాడు అంటే, ఈ ప్రపంచంలో ఏ జీవికి మరి ఏ ఇతరులకు రాని సమస్య తనకు ఒక్కరికే వచ్చినట్లు
కుంగిపోతాడు. కారణం ఆ సమస్య పరిష్కరం కంటే, ఆ సమస్య వచ్చినందుకు, ఆ సమస్య తనకు కలగడానికి ఇతరులను నిందించుటకు తన జీవన విలువైన సమయాన్ని వృద
చేస్తాడు. కాని తను, తన సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు
వేసేవారు చాలా అరుదు.
ఒక సారి నేషనల్ జియోగ్రాపి (National Geographic channel) చానల్
లో చూస్తే, ఆడవిలో ఒకొక్క జీవి పడే కష్టలు ఎంత భయానకం
అనేది తెలుస్తుంది, ఆ జీవుల జీవన పోరాటం ముందు మన జీవన పోరాటం
ఏ మాత్రం సమస్యకాదు.
How to Human Relations are
Depending on Money in Telugu
ఈ ప్రపంచంలో ఒక్క మానవుడు తప్ప, ప్రతి జీవి క్షణ క్షణం జీవన పోరాటం చేస్తాయి. ఏ క్షణంలో ఇతర జీవితో తనకు ప్రాణ
హాని ఉందో తెలియదు ప్రతి క్షణం ఇతర జీవులనుండి తనను తను రక్షించుకుంటు తన తరాన్ని కాపాడుకుంటు, ఆ జీవి జీవనానికి ఆహార ఆన్వేషణ చేయాలి, ఆ ఆహార ఆన్వేషణలో
తనకు ఆ రోజుకు ఆహారం దొరికే వరకు పోరాటం చెయ్యాలి, ఒక్కొక్కసారి
కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ ప్రయాణంలో ఏ క్షణంలోనైన ఆ జీవి ప్రాణాలకు
ముప్పు రావోచ్చు, అయిన దాని ఆన్వేషణ మాత్రం ఆగదు, కారణం తన ద్వేయమ్ ఏ క్షణం మరవదు తన లక్ష్యం గమ్యాన్ని చేరడమే. అది ఆ రోజుతో
ఆగిపోదు ప్రతి రోజు ప్రతి క్షణం చివరికి నిద్రలో కూడా ఆ జీవి అప్రమత్తంగా ఉండాలి.
ఆ జీవులను చూసి మనిషిగా మనం నేర్చుకోవల్సింది
చాలా వుంది, ఆ జీవులు గతన్ని తలుచుకొని దాని గూటిలోనే
ఉండదు, భవిష్యత్ లో ఏమవుతుందో అని తన లక్ష్యన్ని మార్చుకోదు, దానికి ఉన్నదల్ల ఒక్కటే ఆరోజుకు దాని గమ్యాన్ని మరవదు మార్చుకోదు.
How to Inspire a Man - Abdul Story in Telugu
మనిషి మాత్రం గతన్ని తలుచుకొని,ప్రస్తుతన్ని మరుస్తాడు, భవిష్యత్ ను తలుచుకొని వర్తమానాన్ని
నిరుపయోగం చేస్తాడు, నీ పనిని నీవు సవ్యంగా చెయ్యి వర్తమానంలో
ని కర్తవ్యన్ని నిత్యం నిర్వర్తిస్తునే ఉండు, భవిష్యత్ ఆనేది
నీ సమస్యను పరిష్కరిస్తూనే ఉంటుంది.
“గతన్ని గుణపటం చేసుకోని వర్తమానంలో నీ కర్తవ్యన్ని
నిర్వర్తిస్తు భవిష్యత్ ను నిర్మించుకో.”
చివరి వరకు చదివినందుకు దన్యవాదాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి