ఓం సాయి
అప్పుడు
నా వయస్సు 10 సం. కాబోలు 4 వ తరగతి పూర్తి అయి వేసవి సెలవులు ఇచ్చారు ఆ సెలవులకు
నా మిత్రులు కొందరు వల్ల వల్ల అమ్మమ్మ ఉర్లకకు వెళ్ళిపోయారు మరి కొందరు రోజు వారి
అమ్మ నాన్నలు పొలము పనులకు వెళ్ళితే వారితో పాటు వారి బావి దగ్గరికి వెళ్ళేవారు
నాకు మాత్రం ఇంట్లో అఢుకోవడం అమ్మ చెప్పిన చిన్న చిన్న పనులు చేయడంతో రోజు
గడిసిపోయేది వేసవి సెలవులు కాబట్టి అప్పుడు మా ఊరికి నాటకలు ఆడేవారు వచ్చరు వారు
ఊర్లో చివరకు ఉన్న మా బడి ఆవరణలో దిగినారు, మా బడి
ఆఫీసుకు మరో రెండు గదులకు మాత్రమే తలుపులు ఉన్నవి మిగితా గదులకు తలుపులు లేవు, వారు ఆ తలుపులు లేని గదులల్లో దిగినారు. ఆది 1986-87 నాటి రోజులు ఆ
రోజుల్లో నాటకాలు ఒక గొప్ప అనుభూతి, ఆ కాలంలో మా ఊర్లో ఒక్క
గ్రామపంచాయితీ ఆఫీసులో ఉండే టి.వి ఒక గొప్ప విశేషం. అప్పుడు టి.వి లో శాంతి
స్వరూప్ వార్తలు వారానికి ఒక్క సారి వచ్చే చిత్రాలహరి అప్పుడపుడువచ్చే తెలుగు
సినిమాలు అది బ్లాక్ అండ్ వైట్ టి.వి లో , ఒక గొప్ప
కాలక్షేపం, ఆలాంటి రోజుల్లో ఊర్లోకి నాటకాల వాళ్ళు వచ్చి
దాదాపుగా నెల , నెలపదిహేనురోజులు,
ఉర్లో నాటాకాలు అడుతారు అంటే ఉర్లో జనాలకు మరియు మా లాంటి పిల్లలకు ఒక పండుగ
రోజులాగానే ఉండేది .
my school |
ఆ నాటకానికి పెద్దలకు 1 రూ పిల్లలకు 0.50 పైసలు
టికెట్ తొలి రోజు బాలనాగమ్మ కథ అందులో మాయల ఫక్కీరు వేషం ఒక మహా అద్బుతమ్. దానికి
మా అమ్మని బ్రతిమాలి భామలి చివరికి ఒప్పించి , ఆ నాటకానికి
వెల్లను. నాటకం మొదలు రాత్రి 7:30-8:00 గం. మద్యన అధి
వేసవికాలం కాబట్టి చాలా నెమ్మదిగా చీకటి ఆవుతుంది, ఒకటే
కుతూహలం భాహుశ ఆది నా జీవితంలో తొలి నాటకం చూడటం కావచ్చు అది మా బడిలో ఆ
నాటకాలవల్లు మా క్లాస్ రూమ్ లో దిగటం మరి నా చిన్నారి మనసుకు చాలా ఉచ్చహంగా ఉంది
కాబోలు. నాటకం మొదలు కాక ముందే నేను నాతోటి కొందరు మిత్రులు బడిలోకి వెల్లము అక్కడ
ఒక చిన్న ద్వారం పెట్టినారు అందులో నుండి లోపలకి ప్రవేశం 0.50 పై. ఆ ద్వారం దగ్గర
ఉన్న అతనికి ఇచ్చి లోనికి పారేవేశించినము, ఆ క్షణంలో నా మానస్సు ఒక మాయా ప్రపంచంలోకి
ప్రవేశించిన అనుభూతి ఒక నాటక మందిరం ఆందులో రంగు రంగుల వెలుతురులతో వెలిగే
విద్యుత్ దీపాల కాంతి ఒక అద్బుతప్రపంచంలోకి వెల్లిన అనుభూతి భాహుష ఆ క్షణం వరకు
నేను సినిమా హాలు చూసి ఉండక పోవచ్చు కాబోలు, ఆ ప్రదేశం నేను
రోజు ఆడుకొని చదువుకున్న ప్రదేశమే కానీ ఆ విద్యుత్ కాంతుల వలయంలో నాకు ఆ ప్రదేశం
ఒక రంగుల ప్రపంచములా ఆని పించింది. ఒక్కొక్కరుగా నాటక స్థలం జనాలతో నిండిపోయింది , నేను నామిత్రులం ముందునుండి
రెండవ వరసలో కూర్చున్నాము నాటక ప్రారంభ గీతం ఆరంభమైయింది తెరవెనుక
వాయిద్యాల శబ్దం ఒక దేవుని పాట వినిపిస్తున్నాయి తెర తీసే సరికి ఒక బుడ్రకాన
(జోకర్), వింతావేషoలో ప్రత్యేక్షమైనాడు
అతాని వింతావేషoకు నాటక స్టాలంలో ఒకటే నవ్వులు అంతలోనే మరో
ఆడవేషం వచ్చేసింది ఇద్దరు కలిసి ఒక గానంతో వింత వింతగా నృత్యం చెయ్యసాగారు వారి
నృత్యానికి జనాలు అందరు ఒకటే నవ్వులు వీళ్ళ హాస్యం తర్వత యూవరాణీ వస్తునారు
చెలికాత్తే నీవు యువరాణిని చూసుకొనుము అని ఆ చెలికాత్యేకు ఆ జోకర్ చెప్పి లోనికి
వెళ్ళినాడు.
drama |
అపుడు బాలనాగమ్మ అనే స్త్రీపాత్ర ప్రవేశం, ఆ పాత్ర నిజంగా ఒక యువరాణి లాగానే ఉన్నది నా మనస్సుకు నిజంగా ఇది నాటకమా
లేక ఒక దేవకన్య ఈ నాటకంలో ప్రవేశించినాద అని ఆ చిరు ప్రాయంలోనే నా మనస్సును
కరిగించివేసింది, ఆమె ఆ సహజ నటన నా మనస్సును ఒక ఊహ లోకానికి
తీసుకొని వేల్లేది ఇంత గొప్ప ఆందమైన
యూవతి ఈ నాటక ప్రపంచములో ఉందటమేమిటి అని పించేది ఏక్కడో సినీ వినీలాకాశంలో
ఉండాల్సిన తార కాబోలు ఇకడ ప్రత్యక్షమైయింది ఏమో అని పీస్తుండేది, ఆ రోజూ మొదలు ప్రతి రోజు ఆమేని చూడడానికి నేను ఆ నాటకాలకు వెళ్ళేవాడిని, ఉదయం అయితే చాలు మల్లీ వాళ్ళని చూడాలి అని మా బడికి వెళ్ళేవాడిని వాళ్ళు
ఎప్పుడు బయట కనిపించేవారు కాదు ఆ చీకటి ప్ర్రపంచములోనే ఉండేవారు ఏమో చీకటి అయితే
నాటకం మళ్ళీ నా మనస్సుకు రెక్కలు వచ్చేవి తనను చూడవచ్చు కాద ఆని మనస్సుపొరల్లో ఏదో
తెలియని హాయీని ఇస్తుండేది ఆమేను చూస్తుంటే ఆ వేసవి రోజులు ఒక అద్భుత ఊహాలోకంలో
గడుస్తుండగా ,
this is me |
ఒక రోజు తనను చూడాలని మద్యాహ్నం వేళ మా బడి
వద్దకు వెళ్ళినను , అప్పుడు తను మా బడి ప్రాంగణంలో ఉన్న రావి
చెట్టు క్రింద కూర్చొని ఏదో రాగాలు ఆలపిస్తూ తన కురులను సర్దుకుంటుంటే చూసాను తన
అందము నిజంగానే ఆకాశంలోని చందమామ నేలకు దిగివచ్చినదా అన్నటుగా ఉంది, నా రెండు కళ్ళు చాలడంలేదు, ఏమని వర్ణిచ్చను తన
సౌదర్యాని, ప్రకృతి దేవత తన రూపంలో ఈ భూవిపైకి దిగివచ్చింది
అనల ఏమని వర్ణిచ్చను ఏంతాని వర్ణిచ్చను తన సహజమైన అందము అందుకేకభోలు తను నాటకంలో ఏ
పాత్ర వేసిన ఎంతో సహజంగా నటిస్తుంది. నేను తనను చూసిన ఆక్షణం వెల్లి తనతో ఏదో
మాట్లాడాలి అని నా మనస్సుకు ఆరాటం కానీ నా
వయస్సు ఎక్కడ తన వయస్సు ఎక్కడ తనను ఆరాధిoచడమే తప్ప వెల్లి
మాట్లాడే సాహసం చెయ్య లేక పోయాను, బహుశ ఆది నా వయస్సు
ప్రబావమైఉండవచ్చు ఆ రకంగా నేను ప్రతి రోజు తనను చూడటానికి మా బడి ప్రాంగనానికి
వేల్లే వాడిని తనను చూస్తూనే నా మిత్రులతో ఏదో ఆటలు ఆడుతూ ఉండేవాడిని ఆ రకంగా నెల
రోజులు గడిచిపోయాయి అంతలో వేసవి కాలం వెల్లి వర్షాలు ప్రారంభంతో వల్ల నాటక ప్రధర్శన
ఆగి పోయింది వరుసగా వారం రోజులు వర్షలు రోజు సాయంత్రం అయితే చాలు వర్షలు రావడంతో
నాటక ప్రాంగణం తొలిగించారు.
bullock cart |
my drem is going |
ఒక రోజు ఉదయాన వాళ్ళు వేరే ఊరు ప్రయాణం అవుతున్నారు అని మా
మిత్రులు అంటుంటే విని నేను మా బడి వేల్లే సరికి నాటక బృందం వారి సామాన్లు
అన్నిటిని మూటాలుగా సర్ది ఎడ్ల బండ్లల్లో సర్దుతున్నారు నా కళ్ళు తన గూర్చి వెతికాయి
అప్పుడు మా క్లాస్ రూమ్ లో నుండి తను వచ్చి ఒక ఎడ్ల బండిలో కూర్చుంది వారి ప్రయాణం
కొన్ని నిముషాల్లో మొదలవుతుంది , అప్పుడు నా మానస్సు పడే
వేదన ఏమని చెప్పాను ఎదలోపల జరిగే మానసిక సంగర్శన ఉప్పెనలా పొంగుతున్న సముద్ర
కెరటాల హోరులా నా హృదయం చేసే నిశ్శబ్ధ పోరాటం. ఏమిటి తనాకు నాకు ఉన్న అనుభదం ఈ నెల
రోజులు ఒక్క సారి కూడా తనతో మాట్లాడింధి లేదు కానీ ఏమిటి ఈ వేదన తనకు నేను ఎవరిని, నేను తనకు ఎవరిని, తను నాతో ఆడుకోవడాని తనది నా
వయస్సు కాదు, నేను తనను ప్రేమించడానికి నాది తన వయస్సు కాదు, అయినా నా పసి హృదయంలో ఎందుకు గుండెలు పగిలే యాతన ఏమిటి ఈ భాద పేరేమిటి
తను ఎవరు నేను ఎవరు, తనకు నాకు ఏమిటి సంబంధం ఈ బంధానికి గల
పేరేమిటి నా మనస్సుకు కలుగుతున్న ఆ సముద్రహోరు శబ్దాలకు ఆర్డము ఏమిటి, తనను చూస్తూ ఆ రావి చెట్టు క్రింద కూర్చున్న నా అశ్రునయనలకు బాద్యులు
ఎవకు ఈ బాధ యాతన పేరేమిటి ఇది ప్రేమ , ఆరాధన, ఏమని నా పసి హృదయానికి సర్దిచెప్పలి ఇది ఒక మౌన సంగర్షణ నా మనస్సు
పడుతుండగానే వారి ఎడ్లబండి కదిలి రోడ్ ఎక్కింది తను నన్ను చూస్తున్నదన్న బావన నా
మనస్సుకు అనిపిస్తుంది కానీ తను తనలోకంలోఉన్నది, కానీ నా
మనస్సు తన తోనే వెల్లుతున్న భావన నా కనుచూపు మేర తన ప్రయాణం సాగే వారకు చూసి నా
నయనాలు ఆశ్రువులని కార్చేస్తూనే ఉన్నాయి ఈ అశ్రువులకు నా హృదయ హోరుకు ఏమని పేరు
పెట్టను నా పసి హృదయంనుండి వచ్చిన స్వచ్చమైన ప్రేమ అని తప్ప|
my last wish |
Whoo!!
రిప్లయితొలగించండిHi it's good story in child life
రిప్లయితొలగించండి