https://youtu.be/eTsWaD4Nc3Q
నేస్తమా ! నేస్తమా ! ఈ సువిశాల ప్రపంచంలో నేస్తమా ! ఈ సువిశాల ప్రపంచంలో నా మనస్సును గెలిచిన నేస్తమా ! నా మనస్సును గెలిచిన నేస్తమా ! బుడిబుడి నడకలతో మొదలైన మనస్నేహం నేస్తమా ! మనది ఈ జన్మ అనుబంధం కాదు , ఇది ఎన్నో జన్మల సంబంధం. మన చిన్నప్పుడు మీ అమ్మ , మా అమ్మ అనుకునేవారు మనం పాలు త్రాగే వయసులో నా ఎంగిలి పాలు నీవు , నీ ఎంగిలి పాలు నేను త్రాగను అని. మనమే కాదు నేస్తమా! మనవల్ల మన తల్లులు కూడా స్నేహితులుగా మారారు. ఇది అంతా మన స్నేహబలం కాబోలు , కలిసే ఆడుకున్నాము కలిసే తిరిగాము , మనం కలిసి గడిపిన ప్రతిక్షణం ఒక మధురానుభూతి ఇస్తుంది . How to Human Relations are Depending on Money in Telugu చెరువు గట్టుపై కూర్చొని చెరువులో తిరిగే పక్షులను చూసి ఆనందపడ్డము , ఆ పక్షులు నీటిలోనికి మునిగి చేపలను పట్టే విన్యాసాలను తిలికించాం. సాయం సమయంలో నీటిలోనుండి ఎగిరిపడే చేపలను చూసి మన మనస్సులలో కలిగే ఆ ఆనందం ఎప్పుడు మరిచిపోలేము నేస్తమా! చెరువు తుములోనుండి వచ్చే నీటి కాలువలలో ఉండే చేప...