ప్రతి మనిషి జీవన ప్రయాణం LIFE JOURNEY OF EVERY MAN పసితనం వ ర్షం వెలసిన తర్వాత కాగితలని పడవలుగా చేసి కాలువల వెంటపడ్డ పసితనం మనది , కిటికీలో కూర్చొని బయట ఆడుకుంటున్న మన వయస్సు పిల్లలని చూసి కేరింతలతో చప్పట్లు కొట్టే వయస్సుమనది. దండెమ్ మీద ఉయ్యాల ఊగుతున్న పిచ్చుకలను చూసి ఆనంద పడిన క్షణలు మనవి. వర్షం పడుతుంటే తలమీద అమ్మకొంగు కప్పుకొని చినుకులకు చిట్టి చేతులు చాపి రోడ్డు అంత ఒకటే ఆట. వర్షం వెలిసిపోయిన తర్వాత అమ్మ తడిసిపోయి కూడా మన తల మీది నుండి కొంగు తీయకుండా భద్రంగా ఇంట్లోకి చేర్చిన క్షణలు. గొంతు అలలమీద ఘంటసాల పాటలు , అలా సంగీత సముద్రంలో మునకలు. బాల్యం కాంతరావు కత్తి యుద్దాలు చూడటానికి వారాల తరబడి నిరీక్షణ. వేసవి కాలం సెలవులు , ఆవకాయ గుబాళింపులు , ముంజేలు , మావిళ్ళ రుచులతో నిండిన ఋతువులు , సంక్రాంతి చలిమం...
ఓం సాయి అ ప్పుడు నా వయస్సు 10 సం. కాబోలు 4 వ తరగతి పూర్తి అయి వేసవి సెలవులు ఇచ్చారు ఆ సెలవులకు నా మిత్రులు కొందరు వల్ల వల్ల అమ్మమ్మ ఉర్లకకు వెళ్ళిపోయారు మరి కొందరు రోజు వారి అమ్మ నాన్నలు పొలము పనులకు వెళ్ళితే వారితో పాటు వారి బావి దగ్గరికి వెళ్ళేవారు నాకు మాత్రం ఇంట్లో అఢుకోవడం అమ్మ చెప్పిన చిన్న చిన్న పనులు చేయడంతో రోజు గడిసిపోయేది వేసవి సెలవులు కాబట్టి అప్పుడు మా ఊరికి నాటకలు ఆడేవారు వచ్చరు వారు ఊర్లో చివరకు ఉన్న మా బడి ఆవరణలో దిగినారు , మా బడి ఆఫీసుకు మరో రెండు గదులకు మాత్రమే తలుపులు ఉన్నవి మిగితా గదులకు తలుపులు లేవు , వారు ఆ తలుపులు లేని గదులల్లో దిగినారు. ఆది 1986-87 నాటి రోజులు ఆ రోజుల్లో నాటకాలు ఒక గొప్ప అనుభూతి , ఆ కాలంలో మా ఊర్లో ఒక్క గ్రామపంచాయితీ ఆఫీసులో ఉండే టి.వి ఒక గొప్ప విశేషం. అప్పుడు టి.వి లో శాంతి స్వరూప్ వార్తలు వారానికి ఒక్క సారి వచ్చే చిత్రాలహరి అప్పుడపుడువచ్చే తెలుగు సినిమాలు అది బ్లాక్ అండ్ వైట్ టి.వి లో , ఒక గొప్ప కాలక్షేపం , ఆలాంటి రోజుల్లో ఊర్లోకి నాటకాల వాళ్ళు వచ్చ...