ప్రతి మనిషి జీవన ప్రయాణం LIFE JOURNEY OF EVERY MAN పసితనం వ ర్షం వెలసిన తర్వాత కాగితలని పడవలుగా చేసి కాలువల వెంటపడ్డ పసితనం మనది , కిటికీలో కూర్చొని బయట ఆడుకుంటున్న మన వయస్సు పిల్లలని చూసి కేరింతలతో చప్పట్లు కొట్టే వయస్సుమనది. దండెమ్ మీద ఉయ్యాల ఊగుతున్న పిచ్చుకలను చూసి ఆనంద పడిన క్షణలు మనవి. వర్షం పడుతుంటే తలమీద అమ్మకొంగు కప్పుకొని చినుకులకు చిట్టి చేతులు చాపి రోడ్డు అంత ఒకటే ఆట. వర్షం వెలిసిపోయిన తర్వాత అమ్మ తడిసిపోయి కూడా మన తల మీది నుండి కొంగు తీయకుండా భద్రంగా ఇంట్లోకి చేర్చిన క్షణలు. గొంతు అలలమీద ఘంటసాల పాటలు , అలా సంగీత సముద్రంలో మునకలు. బాల్యం కాంతరావు కత్తి యుద్దాలు చూడటానికి వారాల తరబడి నిరీక్షణ. వేసవి కాలం సెలవులు , ఆవకాయ గుబాళింపులు , ముంజేలు , మావిళ్ళ రుచులతో నిండిన ఋతువులు , సంక్రాంతి చలిమం...
How to Human Relations are Depending on Money ఆ సమయం ప్రొద్దుగూటిలో పడే సమయం. ఆకాశంలో పక్షులు అన్ని తమతమ గూటికి చేరడానికి తిరుగుప్రయాణంలో వున్నవి అక్కడక్కడ చెట్లపై పక్షుల అలజడి అవుతుంది. వీధుల్లో ఆవులు గేదలు వాటి పిల్లలను చూడాలనే ఆత్రుతతో వేగంగా నడుస్తున్నవి , వ్యవసాయానికి వెళ్ళిన కూలివాళ్లు తిరుగు ప్రయాణంలో వున్నారు. అందులో కొందరు నన్ను మంధలిస్తు వెళ్ళుతున్నారు మరికొందరు ఈ ముసలిదానితో ఏమి పనిలే అన్నట్టు తలప్రక్కకు త్రిప్పుకొని వెళ్ళుచున్నారు. నేను మాత్రం ఎవరిగురించి ఎదురు చూడటంలేదు , ఎవరు నా ఇంటికి వచ్చేవారు లేరు ఎందుకంటే నేను ఒంటరి ముసలిదాన్ని. కన్నపిల్లలలో మానవత్వం నశిస్తే నాలాంటి ఒంటరి వృద్దులసంఖ్య పెరుగుతూనే వుంటుంది . నేను పుట్టింది ఒక మగ్గం( Loom ) నేసుకునే పేద ఇంటిలో. అవి రజాకారులకు ముందు అని అనేవారు నా తండ్రి , నాకు ఇద్దరు చెల్లెలు మాది పేదకుటుంబం కాబట్టి మా ఊరికి 10.కి.మీ. దూరంలో వున్న మగ్గం ( Loom ) నేసుకునే మరో కుటంబలోకి పెళ్లి అనే కార్యక్రమంతో ప్రవేశించను. నా భర్త మగ్గం( Loom ) న...