కరోనా
Corona ఈ పదం తెలియని వారు ఈ ప్రపంచంలో ఉండరేమో బహుషా ప్రపంచం
మొత్తాన్ని స్తంభిoపజేసిన పదం. ప్రపంచ ఆర్దిక వ్యవస్థనే శాసించి స్తంభిoప
చేసిన పదం, అందరు అంటారు ఈ కరోన వల్ల చాలా నష్టం జరిగింది ఈ ప్రపంచానికి అని అంటారు. కానీ నా ఉద్ధేశ్యo ప్రకారం, ఈ
కరోనా ప్రపంచాన్ని ఉద్దరించడానికి వచ్చిన
ఒక కొత్త అదృశ్య శక్తి రూపమే, ఈ పేరు కావొచ్చు పాత రోజుల్లో ఇట్లాంటి కొత్త వింత
వ్యాదులను ఏదో ఒక దేవత కోపం వల్ల, వచ్చిన ముప్పే ఈ ప్రాణ హాని మరణ భయం అనేవాళ్లూ.
నా దృశ్యకోణంలో మాత్రం ఈ పదం
ప్రపంచ మనవాళికి ఒక గొప్ప ప్రకృతిని అందించడానికి వచ్చిన మరో దేవుని అవతారం
కావొచ్చు దేశంలో ఒక్క 6 నెలలు అన్నీ కాలుష్యవ్యవస్థలన్నీ స్తంబింపచేయడం వల్లన
వాతావరణంలో ఇంత గొప్ప మార్పు చూడంగా, ఈ ప్రకృతికి ఒక్క 6
నెలలు మానవాళి నుండి కాలుష్యాన్ని నివారిస్తే ఎంత మంచి వాతావరణాన్ని మనకు తిరిగి ఇచ్చింది,
వాతావరణంలో ఉష్ణోగ్రత తలసరిగా 27°C .నుండి ప్రస్తుతం
24°C. నమోదౌతుంది. అందుకే నేను అంటాను ఈ కరోన ప్రపంచముకు
స్వచ్చమైన వాతావరణాన్ని, సహజసిద్దమైన ప్రకృతి అందాలని గత 40.సం.గా లేని వర్షాలని ఇస్తుంది.
ఈ
కరోన మనుష్యుల మద్య బంధాలని అనుబంధాలని బలపరిచింది. కొందరి జీవితకాలంలో వారి కుటుంబాలతో గడపడానికి వీలుకాని పని వత్తిడి
నుండి విముక్తి నిచ్చింది, కొందరికి డబ్బే సర్వస్వం అనుకొని గర్వపడే
వారికి ఆ డబ్బుతో ఏమి చేయలేము, మనతో ఏమి రావు, చివరికి నా అనే
వారు కూడా నన్ను తాకలేరు ఈ మనిషి సృష్టించిన యంత్రాలతో మన అంతిమ యాత్ర, ఈ సమాజంలో
యాంత్రికంగ బ్రతికినందుకు ఆ యంత్రాలతోనే నా చివరి నాలుగు అడుగులు అని
నిరూపించింది. ఈ ప్రకృతిని కాపాడు, తిరిగి ఈ ప్రకృతి నీకు కావలసిన నీరును, కావలసిన సహజమైన
గాలిని, ప్రకృతి అందాలను నీకు ప్రసాదిస్తుoది అని
నిరూపించింది.
ఈ
కరోనా ప్రపంచానికి భారతదేశ సంప్రదాయాన్ని, భారతదేశంలో ఎన్ని మతాలు
ఎన్ని సంస్కృతులు ఉన్నా భారతీయ సంప్రదాయాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది.
నమస్కారంతో హిందు సంప్రదాయాన్ని, తరుచూ చేతులు కాళ్ళు శుభ్రపరుచుకోవాలి అని
ముస్లిం సంప్రదాయాన్ని , ముక్కు, నోటికి మాస్కు
పెట్టుకొని సూక్ష్మజీవుల హింస చేయకు అని జైన,బౌద్ధ
సంప్రదాయాన్ని, బలమైన ఆహారం,వేడి కషాయాలు అని
సిక్కు సంప్రదాయాన్ని, ఈ అన్నింటిని కలిపి పాటించు ఈ కరోన అనే
విపత్తును ఈ మానవాళి ఎదుర్కో అని ప్రపంచ దేశాలన్నింటికి భారతీయతని సాటి చెప్పింది
ఈ corona.
ప్రపంచంలో
ఎవరు గొప్పవారుకాదు ఎవరు పేదవారు కాదు, అందరు మొదట మనుష్యులo అని తెలియజేసింది.
ఈ వ్యవస్థకి ఎవరు ఎవరికి బానిసలు కారు, ఎవరు ఎవరికి యజమాని కారు అందరు ఎవ్వరి
పనులు వారు స్వయంగా చేసుకోవాలి అని నేర్పింది ఈ కరోన. అందుకే నేను అంటాను ఈ కరోన
ప్రకృతిని కాపాడటానికి, మానవత్వాన్ని
నిలుపడానికి వచ్చిన మరో దైవ అవతారం కావొచ్చు అని.
ప్రపంచాన్ని
వినాశనం చేసే శక్తి నాది అని ఒకరు, నా దగ్గర డబ్బు అధికారం ఉంది, ఈ ప్రపంచం నా
గుపెట్లో ఉంది అన్నింటికి నేను చెప్పిందే వినాలి అనే దురహంకారంతో ఉన్న దేశాధినేతలనీ, నా దగ్గర ప్రపంచ వినాశకారిని చేసే విషాన్ని చిమ్మి, ప్రపంచ జనజీవనాన్ని
చిన్నా బిన్నం చేసే శక్తి ఉన్నవాన్ని అని
విర్రవీగే దేశాధినేతలను, ఇటు వార్తా వాహినిలకు అటు అంతర్జాలాలకు
దొరకకుండ కొన్ని నెలలు ఎలుక కన్నాలలో దక్కోని గడిపేలా చేసింది ఈ కరోన.
కొందరేమో
యువత, పిల్లలు మొబైల్స్, కంపుటర్లతో
చెడిపోతున్నారు అని చెప్పి దానిపై చర్చాగోష్టులు జరిపి, వాటిపై పరిశోధనలు చేసి
వాటిని విమర్శించిన వారే, ఈరోజు వారి పిల్లలకు కంప్యూటర్స్, మొబైల్స్ కొని ఇస్తున్నారు.
పిల్లలకు అంటూ మొబైల్స్ వారికంటూ ఒక Lap-tap లను కొనిచ్చేసరికి వారి ఆనందానికి అంతు లేదు
కారణం corona.
సంప్రదాయ
విద్య వ్యవస్థే ఈ దేశ భవిష్యత్ అని చెప్పిన
విద్యావేత్తలే ఈ రోజు ఆన్లైన్ (Online) విద్య లో బోధిస్తున్నారు, సంప్రదాయ పుస్తకాలనే
పటించే విద్యార్దులు ఈ రోజు ఈ-బుక్స్ (E-Books) లో చదువుచున్నారు
ఇంత మార్పు రావాలి అంటే కానీసం ఇంక ఒక దశాబ్దకాలం పట్టేది కావచ్చు, కానీ ఈ కరోన(Corona) కారణంగ, విద్యావ్యవస్థ పూర్తిగా
దాని రూపురేఖలనే మార్చివేసుకున్నది.
మొన్నటి వరకు కొన్ని ప్రైవేట్ విద్యా వ్యవస్థలు Smart classes అని, మాది ఒక గొప్ప విద్యా
విధానమని మాది (ఇంటర్నేషనల్) International standard అని గొప్పలు చెప్పుకొని
లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న విద్యాలయాలు, ఈ గవర్నమెంట్ ( government ) విద్యావ్యవస్థ కూడా
Smart classes, online classes లోకి మారి సాధిస్తున్న గొప్ప మార్పు ముందు మేమే
గొప్ప అని చెప్పుకున్న ప్రవేట్ విద్యా వ్యవస్థలు కుప్ప కూలిపోయాయి.
కొందరు
ప్రతి చిన్న వ్యాదికి ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారికి, ఏ మాత్రలు ఏ ట్రీట్
మెంట్ లేకుండా 6 నెలలుగా ఇంట్లోనే ఉండి, ఇంటి చిట్కాలతోనే ఆరోగ్యంగా ఉండ గలం అనే భరోసాని
ఇచ్చింది. ఈ corona కు ఏ చికిత్స చేయకుండా లక్షల రూపాయలు వసూలు చేసే
ప్రవేట్ ఆసుపత్రుల నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపించింది ఈ corona.
మనం
తినే ప్రతి పండ్లు, కూరగాయలు అన్నీ మోతాదుకు మించి క్రిమి సంహారక
మందులతో నిండిపోయాయి. వాటి అన్నింటిని సహజ సిద్దమైన ఉప్పు వేసి శుభ్రంగా
కడిగి తినే సంప్రదాయాన్ని తెరతీసింది. మనం తినే ప్రతి తినుబండారాలు అన్నీ రసాయనిక పదార్దాలతో
సహజ రుచికి బదులు హాని కారక రసాయన రుచులను కలిపి వండి వార్చే, వ్యవస్థల నుండి విముక్తి
కలిగి, ఇంట్లోనే సహజ సిద్దంగా వండి పెట్టె అమ్మ చేతి
వంటకు విలువను పెంచింది ఈ కరోన.
వివాహ
వ్యవస్థలో అయితే ఒక గొప్ప మార్పు, ఒక పెళ్ళి అంటే మామూలు కాదు కోట్లు, లక్షలు ఖర్చు, లక్షల రూపాయలతో ఫoక్షన్ హాల్లు, లక్షల రూపాయల ఖర్చుతో
భోజనాలు అవి సహజంగా కాకుండా రసాయనికంగా వండే వంటలు, వందల రకాల ఆహార పదార్దాలు, వేల మంది బంధువులు దానికి
తోడు పిలువని బంధువులు వేలాదిమంది, అది భోజనాలకు మాత్రమే లక్షల రూపాయల ఖర్చులు.
బట్టలు,బంగారానికి కూడా లక్షల రూపాయల ఖర్చు. వాటి అన్నింటి
నుండి విముక్తి దొరికి, పెండ్లి అంటే ఇంత సహజంగ ప్రకృతిలో మమేకమై దగ్గరి
బంధువులతో పప్పు కూరగాయలతో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు వెళ్ళి లక్షల రూపాయల బట్టలు, బంగారం కాకుండా, ఇంటి దగ్గరో లేక దగ్గరి
పట్టణంలోనో కావలిసిన వరకే బట్టలు బంగారం కొని, వివాహాన్ని జరిపించి
నూతన వధూవరుల జీవితాలలో ఆర్దిక సంక్షోభo రాకుండా, వివాహాన్ని జరిపే తల్లి
తండ్రుల జీవితాలు గొప్పల గూర్చి వెళ్ళి అప్పులపాలు
కాకుండా జీవితాలను నిలబెట్టింది ఈ కరోన.
అందుకే
ఈ ప్రపంచ గమనాన్ని ఈ మానవాళి జీవన విధానాన్ని ప్రకృతిలో మమేకమై ఎంత సహజ సిద్దంగా మానవుడు
బ్రతకవచ్చో నిరూపించిన ఈ corona ని, నా కోణంలో ఒక గొప్ప
అనుభవం, గొప్ప మార్పు అని నా
ఉద్దేశ్యo, ఇకనైనా మనిషి జీవన మరియు ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకొని ,ప్రకృతిని ప్రకోపించకుండ
చూడాల్సిన బాధ్యత ఈ మనిషి పైన ఉన్నది.
ఈ
అనుభవాల గుణపాఠాలనుండి, భారతదేశం ప్రతి సం. లో ఒక నెల అనగా 30 రోజులు
అన్నీ వ్యవస్థలని పూర్తిగా మూసివేసి ఒక్క నెల రోజులు ఎవరు ఎవరి ఇంటికి వెళ్లకుండా, ఒక్క నెల లాక్ డౌన్
ప్రకటించి ఈ దేశ సహజ వనరులను ప్రకృతిని కాపాడాలి అని, మన దేశ వ్యవస్థను కోరుకుందాం.
ఒక్క నెల లాక్ డౌన్ తో 11 నెలలు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు అని నాకోరిక.
స్వస్తి



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి